మొహాలి: భారత్, అఫ్గానిస్థాన్ మధ్య మూడు టీ20ల సిరీస్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. మొహాలీ వేదికగా రాత్రి 7 గంటలకు తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌తో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 14 నెలల తర్వాత టీ20 ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. హిట్‌మ్యాన్ చివరిసారిగా నవంబర్ 2022లో జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో ఆడాడు. ఈ సిరీస్ ద్వారా రోహిత్ శర్మ 4 రికార్డులను అందుకునే అవకాశాలు ఉన్నాయి. రోహిత్ శర్మ మరో 44 పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా చరిత్ర సృష్టిస్తాడు. అలాగే బ్యాట్స్‌మెన్‌గా మరో 147 పరుగులు సాధిస్తే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 4 వేల పరుగులు పూర్తి చేస్తాడు. దీంతో ఈ మార్క్‌ను అందుకున్న రెండో భారత బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించనున్నాడు.
రోహిత్ శర్మ బ్యాట్స్‌మెన్‌గా 18 సిక్సర్లు బాదితే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 100 సిక్సర్లు పూర్తి చేస్తాడు. ఈ సిరీస్‌లో టీమిండియా మూడు మ్యాచ్‌లు గెలిస్తే, టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా అత్యధిక విజయాలు సాధించిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును రోహిత్ శర్మ సమం చేస్తాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా 51 మ్యాచ్‌లు ఆడగా 39 గెలిచింది. ధోనీ కెప్టెన్సీలో టీమిండియా 72 మ్యాచ్‌లు ఆడగా 42 విజయాలు సాధించింది.
తొలి టీ20కి రెండు జట్లు.
టీమ్ ఇండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, శుభమ్ గిల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్
ఆఫ్ఘనిస్తాన్
రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), హజ్రతుల్లా జజాయ్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, ముజీబ్ ఉర్ రహ్మాన్, షరాఫుద్దీన్ అష్రఫ్, కైస్ అహ్మద్, నవీన్-ఉల్-హక్మద్ సఖ్, ఎఫ్.హెచ్. , ఇక్రమ్ అలీఖిల్, ఫరీద్ అహ్మద్ మాలిక్, రహ్మత్ షా, గుల్బాదిన్ నైబ్
నవీకరించబడిన తేదీ – జనవరి 11, 2024 | 09:14 AM