వరుస వర్షాలు, తుపానులతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలని, సహాయక చర్యలకు భారీగా నిధులు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ఎంపీలు శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు.
– తుఫాను ప్రభావిత ప్రాంతాలకు భారీ నిధుల కోసం పట్టు
పెరంబూర్ (చెన్నై): వరుస వర్షాలు, తుపానులతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలని, సహాయక చర్యలకు భారీగా నిధులు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ఎంపీలు శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు. ఈ మేరకు అమిత్ షా అపాయింట్ మెంట్ లభించడంతో ఎంపీలు ఢిల్లీకి బయలుదేరుతున్నారు. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు జిల్లాలు మైచౌంగ్ తుపానుతో అతలాకుతలం కాగా, భారీ వర్షాల కారణంగా తిరునల్‌వేలి, తూత్తుకుడి, తెన్‌కాశి, కన్నీకుమారి జిల్లాలు అతలాకుతలమయ్యాయి. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడిన కేంద్ర అధికారుల బృందం తుఫాను ప్రభావిత జిల్లాలను సందర్శించి వరద నష్టాన్ని అంచనా వేసింది. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తంగం తెన్నరసు విజ్ఞప్తి చేస్తూ సుమారు రూ. కేంద్రమంత్రులు, అధికారులు పర్యటించినా ఇంతవరకు కేంద్రం నుంచి నిధులు రాలేదు. దీంతో రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల ఎంపీలతో బృందం సమావేశమయ్యేందుకు సమయం కేటాయించాలని కేంద్ర మంత్రి అమిత్ షాను కోరుతూ సీఎం స్టాలిన్ లేఖ రాశారు. అదే సమయంలో రాష్ట్రానికి వరద సహాయ నిధులను కేంద్రం అందించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, సీపీఐ ఆందోళనలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో శనివారం రాష్ట్ర ఎంపీలకు అమిత్ షా సమయం కేటాయించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి వరద సహాయ నిధులు రూ.37,907.19 కోట్లు అందించాలని రాష్ట్ర ఎంపీల బృందం కేంద్రమంత్రికి వినతిపత్రం సమర్పించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
నవీకరించబడిన తేదీ – జనవరి 12, 2024 | 07:46 AM