నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ రెండోసారి కలిసి నటిస్తున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ క్రేజీ కాంబినేషన్ మూవీలో పూర్తి యాక్షన్ ప్యాక్డ్ అవతార్‌లో నాని అలరించనున్నాడు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై భారీ బడ్జెట్‌తో డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి రెండు అప్‌డేట్‌లను విడుదల చేశారు మేకర్స్. అందులో ఒకటి ఈ సినిమా దిల్ రాజు చేతుల్లోకి వెళ్లడం.
ఈ సినిమా ఏపీ, తెలంగాణ థియేట్రికల్ రైట్స్‌ని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎస్వీసీ సొంతం చేసుకుంది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక రెండో అప్‌డేట్‌కి వస్తే… బహుముఖ నటుడు ఎస్‌జే సూర్య ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుత షూటింగ్ షెడ్యూల్‌లో ఎస్‌జె సూర్య జాయిన్ కావడంతో, ఈ చిత్రంలో అతని పాత్ర డైనమిక్‌గా ఉంటుందని మేకర్స్ సమాచారం. ఈ రెండు అప్ డేట్స్ తో శనివారం ‘సరిపోదా సత్యభా’ అనే టైటిల్ ట్రెండ్ అయింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన అన్‌చెయిన్డ్ వీడియోకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. నాని రగ్డ్ అండ్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించనున్నాడు. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల కానున్న ఈ చిత్రానికి సెన్సేషనల్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.
ఇది కూడా చదవండి:
====================
*రష్మిక మందన్న: రష్మిక డీప్ ఫేక్ వీడియో.. ఏపీ వ్యక్తి అరెస్ట్
*******************************
*మోహన్ బాబు: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం వచ్చింది కానీ..?
*******************************
*వరుణ్ తేజ్: మెగా ప్రిన్స్ బర్త్ డే స్పెషల్ ‘మట్కా’ ఓపెనింగ్ బ్రాకెట్.. ఎలా ఉంది?
****************************
*హన్సిక: సింగిల్ టేక్‌లో 34 నిమిషాల షాట్..
****************************
నవీకరించబడిన తేదీ – జనవరి 20, 2024 | 10:26 PM