భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ విడిపోయారన్న వార్త ఎట్టకేలకు నిజమైంది. ప్రముఖ పాకిస్థానీ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నారు
షోయబ్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ నటి సనాను పెళ్లాడాడు
కరాచీ/న్యూఢిల్లీ: భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ విడిపోయారన్న వార్త ఎట్టకేలకు నిజమైంది. ప్రముఖ పాకిస్థానీ నటి సనా జావేద్‌ను తాను వివాహం చేసుకున్నట్లు 41 ఏళ్ల షోయబ్ శనివారం వెల్లడించాడు. సనాతో తన పెళ్లి ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 2010లో పెళ్లితో ఒక్కటయిన సానియా, మాలిక్ మధ్య కొంతకాలంగా తీవ్ర విభేదాలున్నాయని 2022 నుంచి వార్తలు వచ్చాయి. సానియా, మాలిక్ రెండేళ్లుగా జంటగా కనిపించడం లేదు. అయితే సానియా, షోయబ్ తమ కుమారుడు ఇజాన్ ఐదో పుట్టినరోజును గతేడాది అక్టోబర్ 30న జరుపుకున్నారు. ఈ వేడుకకు హాజరైనప్పటికీ ఇద్దరూ వేర్వేరుగా తమ కుమారుడితో ఫోటోలు పోస్ట్ చేయడం గమనార్హం. పెళ్లయిన తర్వాత సానియా, షోయబ్‌లు కొంతకాలం దుబాయ్‌లో ఉంటున్నారు. మరి.. సానియా, షోయబ్‌ల విడాకుల విషయం ఇన్నిరోజులు ఇరు పక్షాలు ప్రకటించలేదు. అయితే దీనిపై తాజాగా సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించారు. ‘ఖులా’ (ఇస్లామిక్ షరియా చట్టాలు) ద్వారా సానియా విడాకులు తీసుకున్నట్లు ఇమ్రాన్ వెల్లడించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. మాలిక్‌కి ఇది మూడో పెళ్లి కాగా, 30 ఏళ్ల సనకికి ఇది రెండో పెళ్లి. 2020లో పాకిస్థానీ సింగర్ ఉమర్ జైస్వాల్‌ని పెళ్లాడిన సనా గతేడాది అతడితో విడిపోయింది. సానియా కంటే ముందు, షోయబ్ 2002లో హైదరాబాద్ అమ్మాయి అయేషాను వివాహం చేసుకున్నాడు, ఆ తర్వాత ఆమెతో విడిపోయాడు.
వేదనతో కూడిన పోస్ట్..:’వారం రోజుల క్రితం 37 ఏళ్ల సానియా అద్దం ముందు కళ్లు మూసుకుని నిల్చొని ‘మనకు అసౌకర్యం కలిగించే వాటిని వదిలేయాలి’ అంటూ ఓ చిత్రాన్ని పోస్ట్ చేసింది. ‘పెళ్లి కష్టం..విడాకులు తీసుకోవడం కష్టం. జీవితం మనం అనుకున్నంత సులభం కాదు. నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. మన కష్టాన్ని మనం ఎంచుకోవచ్చు. అయితే ఆ విషయంలో తెలివిగా వ్యవహరించాలి’ అంటూ రెండు రోజుల క్రితం సానియా చేసిన సుదీర్ఘ పోస్ట్ తన వైవాహిక జీవితంలో షోయబ్‌తో తను ఎదుర్కొన్న ఇబ్బందులను పరోక్షంగా సమం చేసింది.
నవీకరించబడిన తేదీ – జనవరి 21, 2024 | 05:12 AM