అయోధ్య రామమందిరం: అయోధ్యలో సూపర్ స్టార్, పవర్ స్టార్.. వీడియోలు వైరల్..

అయోధ్యలో సూపర్ స్టార్ రజనీకాంత్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రామమందిరం ప్రారంభోత్సవం గురించి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్..

అయోధ్య రామమందిరం: అయోధ్యలో సూపర్ స్టార్, పవర్ స్టార్.. వీడియోలు వైరల్..

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవంలో పవన్ కళ్యాణ్ రజనీకాంత్

అయోధ్య రామమందిరం : ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం రేపు జనవరి 22న జరగనుంది. అయోధ్యలో రాముని జీవిత వైభవాన్ని చూడటానికి దేశం నలుమూలల నుండి రామభక్తులు అక్కడికి వెళుతున్నారు. అలాగే దేశంలోని పలువురు ప్రముఖులు కూడా ఈ మహత్తర కార్యక్రమానికి హాజరుకానున్నారు. సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి.

ఈ కార్యక్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ రజనీకాంత్‌లకు కూడా ఆహ్వానాలు అందాయి. దీంతో ఈ ఇద్దరు తారలు ఇవాళ అయోధ్యకు చేరుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ రామమందిరం ప్రారంభోత్సవం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘‘ఇది ఎన్నో ఏళ్ల కల. 500 ఏళ్ల తర్వాత ఇప్పుడు నిజం కానుంది. అందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను” అని అన్నారు.

ఇది కూడా చదవండి: రామమందిరం ప్రారంభోత్సవం: వెండితెరపై రామమందిరం ప్రారంభోత్సవం ప్రత్యక్ష ప్రసారం.. ఎక్కడ? ఎప్పుడు

ఇదిలా ఉంటే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి మెగా ఫ్యామిలీకి కూడా ఆహ్వానం అందింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులు హాజరు కానున్నారు. ప్ర‌స్తుతం టాలీవుడ్ నుంచి వెళ్లిపోతున్న వారి లిస్టులో వీరి పేర్లు బ‌య‌టికి వ‌చ్చాయి. ఇంకా ఎవరైనా ఉన్నారో లేదో రేపు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *