రామమందిరం: తెలంగాణ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు.. ఈ నెల 29 నుంచి..

గత 500 ఏళ్లుగా ఎదురుచూస్తున్న హిందువుల కల నేడు (జనవరి 22) నెరవేరింది. అయోధ్యలో రామమందిరం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరైన వేల మంది అతిరథ మహారథుల నడుమ అత్యంత ప్రతిష్టాత్మకంగా రామ్ లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది. ఈ నేపథ్యంలో జనవరి 23 నుంచి సామాన్య భక్తుల కోసం రామమందిరాన్ని తెరవనున్నారు.దీంతో భక్తులంతా శ్రీరాముడిని దర్శించుకునేందుకు అయోధ్యకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో అయోధ్యకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా నిర్దిష్ట తేదీల్లో రైళ్లను కేటాయిస్తారు.

తెలంగాణ నుంచి కూడా ఈ నెల 29 నుంచి అస్తా రైళ్లు సిద్ధం కానున్నాయి. బీజేపీ నేతృత్వంలో ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా భక్తులంతా అయోధ్యకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. అయితే, పార్లమెంటు పరిధిలోని ఒక్కో అసెంబ్లీ నుంచి 200 మందికి మాత్రమే అయోధ్యకు వెళ్లేందుకు అనుమతి ఉంది. అయోధ్యకు వెళ్లేందుకు 5 రోజుల గడువు ఇస్తున్నారు. మొత్తం 20 కోచ్‌లతో కూడిన ఈ ఆస్తా రైళ్లలో.. ఒక్కో కోచ్‌కు ఒక ఇంచార్జిని నియమిస్తారు. ఒక్కో రైలులో 1400 మందికి ఈ సువర్ణావకాశం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ శ్రీరాముడిని దర్శించుకున్న అనంతరం అదే రైలులో తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు.

రైళ్లు ఏ ప్రాంతం నుంచి ఎప్పుడు బయలుదేరుతాయి..

1. సికింద్రాబాద్ – జనవరి 29

2. వరంగల్ – జనవరి 30

3. హైదరాబాద్ – జనవరి 31

4. కరీంనగర్ – ఫిబ్రవరి 1

5. మల్కాజిగిరి – ఫిబ్రవరి 2

6. ఖమ్మం – ఫిబ్రవరి 3

7. చేవెళ్ల – ఫిబ్రవరి 5

8. పెద్దపల్లి – ఫిబ్రవరి 6

9. నిజామాబాద్ – ఫిబ్రవరి 7

10. ఆదిలాబాద్ – ఫిబ్రవరి 8

11. మహబూబ్ నగర్ – ఫిబ్రవరి 9

12. మహబూబాబాద్ – ఫిబ్రవరి 10

13. మెదక్ – ఫిబ్రవరి 11

14. భువనగిరి – ఫిబ్రవరి 12

15. నాగర్ కర్నూల్ – 13 ఫిబ్రవరి

16. నల్గొండ – 14 ఫిబ్రవరి

17. జహీరాబాద్ – ఫిబ్రవరి 15

నవీకరించబడిన తేదీ – జనవరి 22, 2024 | 09:17 PM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *