హైదరాబాద్: ఇంగ్లండ్ క్రికెట్ జట్టు హైదరాబాద్ చేరుకుంది. బెన్ స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టు ఆదివారం హైదరాబాద్‌కు చేరుకుంది. దాదాపు నెల రోజుల పాటు అబుదాబిలో క్యాంప్ ముగించుకుని ఇంగ్లిష్ టీమ్ నేరుగా హైదరాబాద్‌కు వచ్చింది. శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన ఇంగ్లండ్ ఆటగాళ్లకు సంప్రదాయబద్ధంగా ఆహ్వానం అందింది. మరోవైపు ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. హలో హైదరాబాద్.. ముత్యాల నగరం అని రాసి ఉంది. భారత్, ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 25 నుంచి హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ జట్టు అబుదాబిలో నెల రోజుల క్యాంపు అనంతరం భారత్‌కు వచ్చింది. ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడకుండానే నేరుగా టెస్టు సిరీస్‌లోకి అడుగుపెట్టనుంది. దీంతో ఇంగ్లండ్ జట్టుపై మాజీ ఆటగాళ్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా, ఇప్పటికే హైదరాబాద్ లో అడుగుపెట్టిన భారత జట్టు కూడా ప్రాక్టీస్ ప్రారంభించింది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న రోహిత్ సేన పట్టుదలతో ఉంది. ఈ టెస్టు మ్యాచ్ కోసం భాగ్యనగర వాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్‌లో టెస్టు మ్యాచ్‌లు ప్రారంభమై చాలా రోజులైంది. మరోవైపు, ఈ సిరీస్ రెండు జట్లకు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 సైకిల్‌లో కీలకమైన భాగంగా మారింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 సైకిల్‌లో ఇంగ్లండ్ ఇప్పటివరకు 2 విజయాలు నమోదు చేసి యాషెస్ సిరీస్‌ను డ్రా చేసుకుంది. కాగా, హైదరాబాద్‌లో టెస్టు మ్యాచ్ ముగిసిన వెంటనే వైజాగ్‌లో రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లు వెంటనే జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఇంగ్లండ్ టెస్ట్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమ్స్ ఆండర్సన్, రెహాన్ అహ్మద్, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), డాన్ లారెన్స్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, అలీ పోప్, అలీ రాబిన్సన్
మరింత క్రీడా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నవీకరించబడిన తేదీ – జనవరి 22, 2024 | 08:04 AM