IND vs ENG: టీమిండియాలో విరాట్ కోహ్లీ స్థానంలో RCB ప్లేయర్?

హైదరాబాద్: ఇంగ్లండ్‌తో జరిగే తొలి రెండు టెస్టులకు భారత జట్టులో విరాట్ కోహ్లి స్థానంలో ఎవరిని తీసుకుంటారనే చర్చ ఇంకా కొనసాగుతోంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టుల నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. టీమ్ ఇండియాలో కోహ్లీ స్థానాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కానీ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న విరాట్ కోహ్లి స్థానంలో అదే ఫ్రాంచైజీ నుంచి మరో ఆటగాడిని తీసుకోనున్నట్లు సమాచారం. అతను మరెవరో కాదు, గత ఐపీఎల్ సీజన్‌లో అద్భుతంగా రాణించిన రజత్ పాటిదార్. అనేక జాతీయ క్రీడా వెబ్‌సైట్‌ల నివేదికల ప్రకారం, ఇంగ్లండ్‌తో జరిగే మొదటి రెండు టెస్టులకు భారత జట్టులో రజత్ పాటిదార్ ఎంపికయ్యాడు. దీంతో ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్ ద్వారా రజత్ పాటిదార్ అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కాగా, గత నెలలో దక్షిణాఫ్రికా పర్యటనలో రజత్ పాటిదారు అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న రజత్ పాటిదారు భారత్‌కు షాకిచ్చాడు. ఇంగ్లండ్ లయన్స్ తో జరిగిన రెండు మ్యాచ్ ల్లో 31 ఏళ్ల పాటిదార్ సెంచరీలతో చెలరేగిపోయాడు. అతను రెండు మ్యాచ్‌ల్లో 151 మరియు 111 పరుగులు చేశాడు. అయితే జట్టులో ఎంపికైనప్పటికీ తుది జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమే అనే చెప్పాలి. మరోవైపు రజత్ పటీదార్ ఎంపికతో చాలా కాలంగా జట్టులో స్థానం ఆశిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ కు మరోసారి నిరాశ తప్పకపోవచ్చు. కాగా, భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య గురువారం నుంచి ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు ఇప్పటికే స్టేడియానికి చేరుకుని ప్రాక్టీస్ ప్రారంభించాయి. మరోవైపు గ్రౌండ్‌లో ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు హైదరాబాద్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇంగ్లండ్‌తో తొలి రెండు మ్యాచ్‌లకు భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమ్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, రజత్ పటీదార్, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ సిరాజ్, మహ్మద్ కుమార్ యాదవ్, , జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), అవేష్ ఖాన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *