లోక్‌సభ ఎన్నికలకు ముందు బీహార్ ‘మహాఘటబంధన్’లో తలెత్తిన సంక్షోభం కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. మహాకూటమిలో ఆర్జేడీతో తెగదెంపులు చేసుకోవాలని జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కృతనిశ్చయంతో ఉన్నారని, బీజేపీ మద్దతుతో సీఎంగా కొనసాగేందుకు ఆయన మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన శనివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి.

పాట్నా: లోక్‌సభ ఎన్నికలకు ముందు బీహార్ ‘మహాఘటబంధన్’లో తలెత్తిన సంక్షోభం కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. మహాకూటమిలో ఆర్జేడీతో తెగదెంపులు చేసుకోవాలని జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కృతనిశ్చయంతో ఉన్నారని, బీజేపీ మద్దతుతో సీఎంగా కొనసాగేందుకు ఆయన మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన శనివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి.
నితీష్ నిర్ణయానికి కారణం అదేనా?
కొంతకాలంగా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆర్జేడీతో అసంతృప్తిగా ఉన్న నితీశ్ కుమార్ పార్టీకి దూరంగా ఉండాలని తుది నిర్ణయం తీసుకోవడం వెనుక కారణమేంటన్నది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వంశపారంపర్య పాలనపై నితీష్ కుమార్ గురువారం చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య చేసిన వరుస ట్వీట్లు ఆయనకు ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం. ఆ వెంటనే ఢిల్లీలో ఒక ముఖ్యమైన సమావేశం, పాట్నాలో మరొకటి జరిగింది. తొలి సమావేశం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలో జరగగా, రెండో సమావేశం నితీశ్ కుమార్ అధ్యక్షతన పాట్నాలో జరిగింది. కాగా, అమిత్ షాతో పాటు రాష్ట్ర బీజేపీ నేతలు నితీష్ కూడా తమతో వచ్చే అంశాన్ని పరిశీలిస్తామని ఇప్పటికే సంకేతాలిచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తాయని కొన్ని అంచనాలు నితీశ్ ను ఆలోచింపజేసి ఉండొచ్చని అంటున్నారు. ప్రధాని కావాలన్న ఆశలు ఇప్పట్లో నెరవేరే అవకాశం లేకపోలేదని, సీఎం పదవిని వదులుకోకూడదనుకోవడం కూడా నితీష్ కమలనాథుల వైపు మొగ్గు చూపడానికి కారణమని అంటున్నారు.
నవీకరించబడిన తేదీ – జనవరి 26, 2024 | 05:20 PM