ఇటీవలి కాలంలో విమానాశ్రయాల్లో గానీ, విమానాలు గాలిలో ఉన్నప్పుడు గానీ వింత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు ప్రయాణికులు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ గందరగోళ వాతావరణం సృష్టిస్తున్నారు. తాజాగా మెక్సికోలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది.
ఇటీవలి కాలంలో విమానాశ్రయాల్లో గానీ, విమానాలు గాలిలో ఉన్నప్పుడు గానీ వింత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు ప్రయాణికులు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ గందరగోళ వాతావరణం సృష్టిస్తున్నారు. తాజాగా మెక్సికోలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ విమానం టేకాఫ్‌కు సిద్ధంగా ఉండగా.. ఓ ప్రయాణికుడు అకస్మాత్తుగా ఎమర్జెన్సీ డోర్ తెరిచాడు. అంతేకాదు.. విమానం రెక్కపై నడుచుకుంటూ బయటకు వెళ్లాడు. మెక్సికో సిటీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అతని చర్యకు తోటి ప్రయాణికులు మద్దతు తెలిపారు.
పూర్తి వివరాల్లోకి వెళితే… ఏరోమెక్సికో విమానం ఏఎం672 గురువారం ఉదయం 8.30 గంటలకు గ్వాటెమాలాకు బయలుదేరాల్సి ఉంది. అయితే.. కొన్ని అనుకోని కారణాల వల్ల విమానం నిర్ణీత సమయానికి టేకాఫ్ కాలేదు. దాదాపు నాలుగు గంటల పాటు విమానాశ్రయంలోనే ఉండిపోయింది. దీంతో లోపల కూర్చున్న ప్రయాణికులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. సరైన గాలి, నీటి సరఫరా లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్‌ను తెరిచి విమానం రెక్కపై నుంచి బయటకు వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత అతను విమానంలోకి తిరిగి వచ్చాడు. అయితే.. దీన్ని వికృత చర్యగా భావించిన విమాన సిబ్బంది అతడిని పోలీసులకు అప్పగించారు. దీంతో అతడికి మద్దతుగా తోటి ప్రయాణికులు ముందుకొచ్చారు.
నాలుగు గంటల పాటు విమానం ఆలస్యమవడంతో గాలి, నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామని ప్రయాణికులు తెలిపారు. అలాంటి సమయంలో ఆయన ఎమర్జెన్సీ డోర్ తెరిచి తమ ప్రాణాలను కాపాడారని.. ఆయన చేసిన పని మంచిదన్నారు. అతనికి మద్దతుగా మొత్తం 77 మంది ప్రయాణికులు ఈ ప్రకటనపై సంతకం చేశారు. అయితే ఈ ఘటనపై ఏరోమెక్సికో ఇంకా స్పందించలేదు. అలాగే ఎమర్జెన్సీ డోర్ తెరిచిన ప్రయాణికుడి వివరాలు కూడా వెల్లడించలేదు. అయినప్పటికీ, అతని తోటి ప్రయాణికులు అతను చేసిన పనికి అతన్ని హీరోగా భావిస్తారు.
నవీకరించబడిన తేదీ – జనవరి 27, 2024 | 03:26 PM