హైదరాబాద్‌లో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సిరీస్‌లో, ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులు చేయగా, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 436 పరుగులు చేసింది. భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల ఆధిక్యం లభించింది. కానీ ఓలీ పోప్ (196) భారీ సెంచరీతో చెలరేగడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 420 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్‌కు 231 పరుగుల లక్ష్యం మిగిలింది.
ఓపెనర్లు రోహిత్ శర్మ (39), యశస్వి జైస్వాల్ (15) తొలి వికెట్‌కు 42 పరుగులు జోడించి భారత్‌కు శుభారంభాన్ని అందించారు. యశస్వి జైస్వాల్ అవుట్ కాగా.. వన్ డౌన్ లో వచ్చిన శుభ్ మన్ గిల్ రెండు బంతులు ఎదుర్కొని ఔటయ్యాడు. దీంతో భారత్ 42 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
మరోవైపు ధీటుగా ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ (39) జట్టు స్కోరు 63 వద్ద మూడో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఈ దశలో కేఎల్ రాహుల్ (22), అక్షర్ పటేల్ (17) కాసేపు వికెట్ల పతనాన్ని ఆపారు. నాలుగో వికెట్‌కు 32 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత అక్షర్ పటేల్ ఔటయ్యాడు. టామ్ హార్ట్లీ కూడా ఈ నాలుగు వికెట్లు తీశాడు.
ఈ దశలో ఇంగ్లండ్ బౌలర్లు విజృంభించారు. ఫలితంగా భారత్ 117 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో రవిచంద్రన్ అశ్విన్, కేఎస్ భరత్ (28) కాసేపు వికెట్ల పతనాన్ని ఆపారు. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు 57 పరుగులు జోడించారు. నాలుగో రోజు ముగిసే సరికి భరత్ ఔటయ్యాడు. ఆ తర్వాత భారత్ ఇన్నింగ్స్ ముగియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. చివరికి భారత్ 202 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా 28 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇంగ్లండ్ బౌలర్లలో టామ్ హార్ట్లీ ఏడు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా, జో రూట్, జాక్ లీచ్ ఒక్కో వికెట్ తీశారు.
AUS vs WI : చరిత్ర సృష్టించిన వెస్టిండీస్.. ఆ నిర్ణయం వల్లే ఆస్ట్రేలియా ఓడిపోయింది..!
ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నంలో రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది.