IND vs ENG: ఉప్పల్ మ్యాచ్‌లో సౌకర్యాలపై ఇంగ్లండ్ అభిమానులు అసంతృప్తి.. వీడియో షేర్!

IND vs ENG: ఉప్పల్ మ్యాచ్‌లో సౌకర్యాలపై ఇంగ్లండ్ అభిమానులు అసంతృప్తి.. వీడియో షేర్!

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. ఉప్పల్ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులకు సరైన ఏర్పాట్లు లేవు. సరైన తాగునీటి వసతి లేకపోవడమే కాకుండా మరుగుదొడ్లు కూడా శుభ్రంగా ఉంచడం లేదు. దీంతో మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వచ్చిన అభిమానులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా స్టేడియంలో నాసిరకం ఏర్పాట్లపై ఇంగ్లాండ్ అభిమానులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. టాయిలెట్లు ముఖ్యంగా మురికిగా ఉన్నాయని చూపించే వీడియో కూడా X లో షేర్ చేయబడింది. వాటర్ బాటిళ్లను, సన్‌స్క్రీన్‌ను స్టేడియంలోకి అనుమతించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

అయితే స్టేడియం లోపలికి వాటర్ బాటిళ్లను అనుమతించబోమని హెచ్‌సీఏ గతంలోనే ప్రకటించింది. కానీ స్టేడియంలో సరైన నీటి వసతి ఏర్పాటు చేయలేదని తెలుస్తోంది. ఇంగ్లండ్ అభిమానులు చెబుతున్నదాని ప్రకారం.. స్టేడియంలో తాగునీటి సౌకర్యాన్ని కొన్ని చోట్ల ఏర్పాటు చేశారు. దీంతో తాగునీటి కోసం భారీ క్యూలు కట్టారు. మంచి నీళ్లు తాగేందుకు గంటల తరబడి లైన్లో నిలబడాల్సి వచ్చింది. గ్రౌండ్‌లో కనీసం వాటర్ బాటిళ్లు, సన్‌స్క్రీన్‌లు కూడా విక్రయించలేదు. మరుగుదొడ్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మరుగుదొడ్లు మురికి నీటితో నిండిపోయాయి. వాటిని అస్సలు శుభ్రం చేయలేదు. దీంతో హెచ్‌సీఏ అధికారుల తీరుపై అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ ను భారత్ ఓటమితో ప్రారంభించింది. ఆదివారం ఉప్పల్‌లో నాలుగో రోజు ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. కెరీర్ లో తొలి టెస్టు ఆడిన స్పిన్నర్ టామ్ హార్ట్లీ (7/62) భారత్ విజయానికి అడ్డాగా నిలిచాడు. ఆరంభంలో అనూహ్యంగా టాపార్డర్‌ను ఢీ కొట్టాడు. కానీ ఆఖరులో టెయిలెండర్లు పోరాటాన్ని ప్రదర్శించారు. కానీ కీలక సమయంలో హార్ట్లీ వారిని పెవిలియన్‌కు చేర్చి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఫలితంగా 231 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 69.2 ఓవర్లలో 202 పరుగులకే కుప్పకూలింది. రోహిత్ (39), భరత్ (28), అశ్విన్ (28), రాహుల్ (22) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. అంతకుముందు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 420 పరుగులు చేసింది. ఆలీ పోప్ (196) తృటిలో డబుల్ సెంచరీని కోల్పోయాడు. హార్ట్లీ (34), రెహాన్ (28) రాణించారు. బుమ్రాకు 4, అశ్విన్‌కు 3, జడేజాకు 2 వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 246, భారత్ 436 పరుగులు చేశాయి. పోప్నాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. రెండో టెస్టు వచ్చే నెల 2న విశాఖపట్నంలో ప్రారంభం కానుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *