‘ఈ సినిమా కోసం చాలా రోజులుగా ప్రిపేర్ అయ్యాను. బ్యాండ్ వాయించడం నేర్చుకున్నాను. కథకు కనెక్ట్ అయ్యేలా సన్నివేశాలను మళ్లీ మళ్లీ ప్రాక్టీస్ చేశాను. క్యారెక్టర్ కోసం రెండు సార్లు గుండు కొట్టించుకున్నాను. ఈ సినిమా నా రెండేళ్ల కష్టం. మంచి ఫలితం వస్తుంది…
‘ఈ సినిమా కోసం చాలా రోజులుగా ప్రిపేర్ అయ్యాను. బ్యాండ్ వాయించడం నేర్చుకున్నాను. కథకు కనెక్ట్ అయ్యేలా సన్నివేశాలను మళ్లీ మళ్లీ ప్రాక్టీస్ చేశాను. క్యారెక్టర్ కోసం రెండు సార్లు గుండు కొట్టించుకున్నాను. ఈ సినిమా నా రెండేళ్ల కష్టం. మంచి ఫలితం వస్తుందని ఆశిస్తున్నాను. హీరో సుహాస్ అన్నారు. ఆయన కథానాయకుడిగా ‘అంబాజీపేట పెళ్లి బంధు’ చిత్రం రూపొందింది. శివాని నగరం హీరోయిన్. దుష్యంత్ కటినేని దర్శకుడు. వెంకటేష్ మహా, ధీరజ్ మొగిలేని నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది.ఈ సందర్భంగా సుహాస్ విలేకరులతో ముచ్చటించారు. ‘దుష్యంత్ రాసిన కథ నన్ను కదిలించింది. అతను నిజ జీవితంలో చూసిన కొన్ని సంఘటనల స్ఫూర్తితో ఈ కథ సాగుతుంది. లాక్‌డౌన్ కారణంగా స్క్రిప్ట్‌ని బాగా చదివే అవకాశం వచ్చింది. కథపై నమ్మకంతో గుండు గీయించుకున్నా. 2007లో జరిగే కథ ఇది. ఇంటర్వెల్‌కి ఇరవై నిమిషాల ముందు వరకు సరదాగా సాగుతుంది. అక్కడి నుంచి మరో స్థాయికి వెళ్తుంది. సెకండాఫ్ మొత్తం ఎమోషనల్ ఫీల్‌గా సాగింది. ఈ కథలో ‘కలర్ ఫోటో’కి మించిన హై ఎమోషన్ ఉంది అని సుహాస్ అన్నారు. అలాగే ‘అహం మనుషుల మధ్య ఎలాంటి అడ్డంకులను సృష్టిస్తుంది? అనే ప్రశ్నకు సమాధానమే ఈ కథనం. నేను, శరణ్య కవలలు. మా పుట్టినరోజున జరిగిన సంఘటనలు మీ జీవితాలను ఎలా మార్చాయనేది ఈ సినిమాలో కీలకాంశం. కథలోని చాలా సన్నివేశాలు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. నిజానికి దగ్గరగా ఉన్నాయి. ఫైనల్ కాపీ చూసిన తర్వాత సినిమాపై నమ్మకం కలిగింది. ముఖ్యంగా శేఖర్‌చంద్ర నేపథ్య సంగీతం సినిమాను మరో రేంజ్‌కి తీసుకెళ్లింది. కథానాయికగా పరిచయం అవుతున్న శివకు మంచి భవిష్యత్తు ఉంది. ఆమె మంచి నటి. సినిమాపై అందరం కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఫిబ్రవరి 2న అందరూ థియేటర్‌కి వెళ్లాలని కోరుకుంటున్నాను’ అని సుహాస్ అన్నారు.
నవీకరించబడిన తేదీ – జనవరి 31, 2024 | 01:46 AM