దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ సంక్షోభం వచ్చినా కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంపులకు హైదరాబాద్ వేదికగా నిలుస్తోంది. జార్ఖండ్ ఎమ్మెల్యేలు ఇటీవల హైదరాబాద్ వచ్చారు. బీహార్ ఎమ్మెల్యేలు ఆదివారం శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు.

హైదరాబాద్ నుంచి సొంత రాష్ట్రానికి జేఎంఎం కూటమి శాసనసభ్యులు
ఆ వెంటనే బీహార్ ఎమ్మెల్యేలు నగరానికి.. ఇబ్రహీంపట్నంలోని రిసార్ట్‌కు చేరుకున్నారు
12న విశ్వాస పరీక్ష.. అప్పటి వరకు ఇక్కడ.. టీపీసీసీ నేతల పర్యవేక్షణ
హైదరాబాద్/ఇబ్రహీంపట్నం/మేడ్చల్‌టౌన్, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ సంక్షోభం వచ్చినా కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంపులకు హైదరాబాద్ వేదికగా నిలుస్తోంది. జార్ఖండ్ ఎమ్మెల్యేలు ఇటీవల హైదరాబాద్ వచ్చారు. బీహార్ ఎమ్మెల్యేలు ఆదివారం శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. హేమంత్ సోరెన్ రాజీనామా తర్వాత ఏర్పడిన రాజకీయ సంక్షోభంతో ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, జేఎంఎం పార్టీలకు చెందిన 39 మంది ఎమ్మెల్యేలను రెండు ప్రత్యేక విమానాల్లో రెండు రోజుల క్రితం హైదరాబాద్ కు తరలించిన సంగతి తెలిసిందే. ప్రత్యేక భద్రతా ఏర్పాట్లతో టీపీసీసీ వారిని అక్కడి నుంచి సమీర్‌పేటలోని లియోనియా రిసార్ట్‌కు తరలించారు. సోమవారం శాసనసభలో బల నిరూపణ కానున్న జార్ఖండ్ కొత్త సీఎం చంపే సోరెన్ దృష్ట్యా ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరి వెళ్లారు. ఈ నెల 12న బీహార్‌లో నితీశ్ కుమార్ విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న నేపథ్యంలో తాజాగా ఆ రాష్ట్రానికి చెందిన 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను జాగ్రత్తగా హైదరాబాద్‌కు తరలించారు. ఉదయం 5.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో జార్ఖండ్ ఎమ్మెల్యేలను రాంచీ విమానంలో ఎక్కించగా, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తదితరులు… ఉదయం 6 గంటల వరకు అక్కడే ఉండి పాట్నా నుంచి శంషాబాద్ చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు స్వాగతం పలికారు. వారందరినీ ఇబ్రహీంపట్నం శివార్లలోని సిరి నేచర్ వ్యాలీ రిసార్ట్‌కు తరలించారు. ఈ నెల 11 వరకు ఈ శిబిరంలోనే ఉండనున్న సంగతి తెలిసిందే.
నవీకరించబడిన తేదీ – ఫిబ్రవరి 05, 2024 | 06:27 AM