పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..! తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అధికార పక్షం.. బడ్జెట్ ప్రజలకు మొండిచేయి చూపడంపై విపక్షాల వాదన.. ఆరోపణలు-ప్రత్యారోపణలు.. సవాళ్లు-ప్రతిసవాళ్ల సభలు..! కానీ, ఈసారి
లోక్‌సభ ఎన్నికల ప్రభావం..
ఎన్నికల పర్యటనలో పార్టీ నేతలు
ఉభయ సభలు అలసిపోయి కనిపిస్తున్నాయి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..! తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అధికార పక్షం.. బడ్జెట్ ప్రజలకు మొండిచేయి చూపడంపై విపక్షాల వాదన.. ఆరోపణలు-ప్రత్యారోపణలు.. సవాళ్లు-ప్రతిసవాళ్ల సభలు..! కానీ, ఈసారి అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. అందుకే.. ఢిల్లీ పెద్దల మూడ్ ఇప్పుడు లోక్ సభ ఎన్నికలపైనే..! ఓ వైపు ప్రధాని మోదీ.. మరోవైపు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇతర పార్టీల నేతలు, ఎంపీలు కూడా తమ రాష్ట్రాలపై దృష్టి సారిస్తుండడంతో పార్లమెంట్ ఉభయ సభల్లోనూ సభ్యులు కనిపించడం లేదు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత ఏ క్షణంలోనైనా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలో రెండు నెలలుగా ప్రధాని మోదీ పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఆదివారం వరకు ఆయన 11 రాష్ట్రాల్లో పర్యటించారు. ఆయా రాష్ట్రాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. శని, ఆదివారాల్లో ఆయన ఒడిశా, అసోంలో పర్యటించారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఆయన ఈశాన్య రాష్ట్రాలతోపాటు పలు రాష్ట్రాల్లో పర్యటిస్తారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. నిన్న మొన్నటి వరకు మీడియాతో ఇంటరాక్ట్ అవ్వని కేంద్రమంత్రులు కూడా ఇప్పుడు స్వయంగా ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా ఇప్పుడు యాత్రలతో బిజీగా ఉన్నారు. భారత్ జోడో న్యాయాత్ర నార్త్ ఈస్ట్ లో ప్రారంభమై ముంబై వరకు కొనసాగనున్న సంగతి తెలిసిందే.
నవీకరించబడిన తేదీ – ఫిబ్రవరి 05, 2024 | 07:24 AM