ఆస్ట్రేలియా పురుషుల జట్టు అద్భుత విజయం సాధించింది. వన్డే క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని అందుకుంది.
ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్: ఆస్ట్రేలియా పురుషుల జట్టు అద్భుత విజయం సాధించింది. వన్డే క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని అందుకుంది. వన్డే క్రికెట్‌లో ఇది 1000వ మ్యాచ్ కావడం కూడా గమనార్హం. కాన్‌బెర్రా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో మరో 259 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్ వన్డే ఫార్మాట్‌లో అత్యల్ప బంతుల్లో ఆరో మ్యాచ్‌గా రికార్డు సృష్టించింది.
ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. 24.1 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది. వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్లలో అలిక్ అథానాజ్ (32), కేసీ కార్తీ (10), రోస్టన్ చేజ్ (12) మాత్రమే రెండంకెల స్కోరు చేయగా, మిగిలిన వారు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ముగ్గురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జేవియర్ బార్ట్‌లెట్ నాలుగు వికెట్లతో వెస్టిండీస్‌ను శాసించాడు. లాన్స్ మోరిస్, ఆడమ్ జంపా చెరో రెండు వికెట్లు తీశారు. సీన్ అబాట్ ఒక వికెట్ తీశాడు.
ఈ లక్ష్యాన్ని ఆసీస్ 6.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆసీస్ ఓపెనర్లు జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ (41; 18 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు), జోష్ ఇంగ్లిస్ (35 నాటౌట్; 16 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, ఒషానే థామస్ చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్‌ను వైట్‌వాష్ చేసింది.
ఇదిలా ఉంటే..ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన వన్డేల్లో అతి తక్కువ బంతులు వేసిన మ్యాచ్ గా నేటి మ్యాచ్ రికార్డులకెక్కింది.
ఒక వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఛేజ్ కేవలం 6.5 ఓవర్లలో 87 పరుగులకే ఆలౌటైంది.
స్మిత్ నేతృత్వంలోని ప్రపంచ ఛాంపియన్స్ 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. pic.twitter.com/tMPO9NCayV
– జాన్స్. (@CricCrazyJohns) ఫిబ్రవరి 6, 2024