కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ బాటలోనే అదే ఇండస్ట్రీకి చెందిన హీరో విశాల్ కూడా నడవబోతున్నాడని కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. విశాల్ కూడా విజయ్ తరహాలో కొత్త పార్టీ పెట్టి వచ్చే తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాడనే వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో తాజాగా విశాల్ సోషల్ మీడియాలో ఓ లేఖను విడుదల చేశారు. ఇందులో ఆయన కొత్త పార్టీపై వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చారు. అవన్నీ పుకార్లు అని కొట్టిపారేశాడు.
విశాల్ విడుదల చేసిన లేఖలో. నన్ను నటుడిగా, సామాజిక కార్యకర్తగా గుర్తించిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజలకు సేవ చేయడం, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలనే లక్ష్యంతో నా అభిమాన సంఘం నడుపుతున్నాను. దీనిని ‘విశాల్ మక్కల్ నల ఇయక్కం’ (విశాల్ పబ్లిక్ వెల్ఫేర్ అసోసియేషన్)గా మార్చి జిల్లాలు, నియోజకవర్గాలకు విస్తరించాలని నిర్ణయించాం. మా అమ్మ పేరు మీద స్థాపించిన ‘దేవి ఫౌండేషన్’ ద్వారా… పేద విద్యార్థులకు, బాధిత రైతులకు సాయం చేస్తున్నాం. అలాగే షూటింగులకు వెళ్లినప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజల కష్టాలు, అవసరాలు తెలుసుకుని వారికి తగిన సాయం చేసి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాం. ఈ సంక్షేమ కార్యక్రమాలతో నేను ఎప్పుడూ ఎలాంటి రాజకీయ లబ్ది ఆశించలేదు. అయితే భవిష్యత్తులో ప్రజల కోసం పోరాడేందుకు వెనకడుగు వేయను’’ అని విశాల్ అన్నారు.(Vishal Letter on His Political Entry Rumors)
ఈ లేఖ సారాంశం ప్రకారం.. ప్రస్తుతానికి విశాల్ కొత్త పార్టీ, పొలిటికల్ ఎంట్రీ లేదని తెలుస్తోంది. భవిష్యత్తులో ఆయన రాజకీయ బాట పట్టే అవకాశం కూడా లేకపోలేదు. ఇదే విషయాన్ని విశాల్ లేఖలో తెలియజేశాడు. ఇదిలా ఉంటే, ఇటీవల ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో కొత్త పార్టీని ప్రారంభించిన నటుడు విజయ్ వచ్చే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ఈలోగా అంగీకరించిన సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. విశాల్ కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం హరి దర్శకత్వంలో ‘రత్నం’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. (కోలీవుడ్ హీరో విశాల్)
ఇది కూడా చదవండి:
====================
*కిరణ్ అబ్బవరం: కొత్త దర్శకుడితో కిరణ్ అబ్బవరం.. టైటిల్ ఫిక్స్
****************************
*RRR: మరోసారి హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జక్కన్నను ప్రశంసించారు
*******************************
*వరుణ్ తేజ్: మొదట లావణ్య.. తర్వాత ఆ హీరోయిన్ అంటే ఇష్టం
****************************
*రష్మిక మందన్న: ఏం చేయను.. మీడియా అలా రాస్తోందని చెప్పండి..
*******************************
నవీకరించబడిన తేదీ – ఫిబ్రవరి 07, 2024 | 04:55 PM