Nareddra Modi: చూస్తుండగానే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారిందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి 40 సీట్లు కూడా రావని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ.. దేశాన్ని మరోసారి విభజించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దేశాన్ని ఉత్తర, దక్షిణాలుగా విభజించేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదం, వేర్పాటువాదం పెరిగిపోయాయని దుయ్యబట్టారు. మీడియా స్వేచ్ఛను కాంగ్రెస్ హరించిందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీని ఆంగ్లేయుడు స్థాపించాడని, బ్రిటీష్ ప్రభావం ఇప్పటికీ ఉందని వ్యాఖ్యానించారు. భారతీయ భాషలను చిన్నచూపు చూస్తూ ఆంగ్లాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. బ్రిటీష్ వారు భారత పార్లమెంటును నడిపిన విధంగానే వారు నడిపించారని అంటారు. బానిసత్వపు గుర్తులను చెరిపేస్తున్నామన్నారు. నెహ్రూ రిజర్వేషన్లకు వ్యతిరేకమని, రుజువు కావాలంటే రికార్డులు చూడాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే ఉద్యోగాల్లో నైపుణ్యాలు దెబ్బతింటాయని నెహ్రూ వెల్లడించారు. ఆదివాసీలు, దళితులు హస్తం పార్టీకి చెందరు. అంబేద్కర్ లేకపోతే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు వచ్చేవని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ తనకు భారతరత్న ఇవ్వలేదని, తమ హయాంలోనే దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించిందని గుర్తు చేశారు. ఆదివాసీ బిడ్డను తొలిసారి రాష్ట్రపతిని చేసింది బీజేపీయేనని పునరుద్ఘాటించారు.
ఇది కూడా చదవండి: ఉమ్మడి పౌర స్మృతి లక్ష్యం ఏమిటి?
దేశ సైనికులకు కాంగ్రెస్ ఒక్క స్మారకం కూడా నిర్మించలేదన్నారు. పదేళ్ల బీజేపీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థను 5వ స్థానానికి తీసుకొచ్చామని, దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోభం నుంచి గట్టెక్కించామన్నారు. కాంగ్రెస్ విదేశీ వస్తువులను ప్రోత్సహిస్తుంటే.. మేకిన్ ఇండియాకు ఎంకరేజ్ చేస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం రైతులకు, యువతకు, మహిళలకు పెద్దపీట వేసిందన్నారు.