ఉత్తరాఖండ్‌లో అల్లర్లు.. 5 వేల మందిపై కేసులు

ABN
, ప్రచురణ తేదీ – ఫిబ్రవరి 11, 2024 | 04:20 AM

ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో జరిగిన అల్లర్లపై పోలీసులు రంగంలోకి దిగారు. రెండు రోజుల క్రితం బండల్‌పురా, హల్ద్వానీలో జరిగిన అల్లర్ల కారణంగా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. హల్ద్వానీ పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ ఎత్తివేస్తున్నట్లు పోలీసు అధికారులు ప్రకటించారు.

ఉత్తరాఖండ్‌లో అల్లర్లు.. 5 వేల మందిపై కేసులు

హల్ద్వానీ, ఫిబ్రవరి 10: ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో జరిగిన అల్లర్లపై పోలీసులు రంగంలోకి దిగారు. రెండు రోజుల క్రితం బండల్‌పురా, హల్ద్వానీలో జరిగిన అల్లర్ల కారణంగా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. హల్ద్వానీ పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ ఎత్తివేస్తున్నట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. అల్లర్లకు బాధ్యులైన 19 మందిని గుర్తించామని, వారితో పాటు మరో ఐదు వేల మంది గుర్తు తెలియని వ్యక్తులపై కేసులు నమోదు చేశామని ఎస్‌ఎస్పీ ప్రహ్లాద్ నారాయణ్ మీనా తెలిపారు. వారిలో చాలా మందిని అదుపులోకి తీసుకున్నామని, మిగిలిన వారిని గుర్తించేందుకు అన్వేషణ చేపట్టామని మీనా పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి అల్లర్లకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. ఈ ప్రాంతాల్లో దాదాపు 1200 మంది భద్రతా సిబ్బందిని మోహరించినట్లు ఆయన వివరించారు. శనివారం మరో ఇద్దరు మరణించారని, అయితే వారి మరణానికి గల కారణాలు పోస్ట్‌మార్టం పూర్తయ్యే వరకు తెలియవని ఎస్‌ఎస్‌పి తెలిపారు. గత శుక్రవారం చేపట్టిన ఆక్రమణల తొలగింపుతో హల్వానీలో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనల్లో ఆ రోజు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగిన ప్రాంతాలను సందర్శించిన సీఎం పుష్కర్ సింగ్.. ఉత్తరాఖండ్‌లో శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, చట్టాన్ని ఎవరైనా చేతుల్లోకి తీసుకున్నా ఉపేక్షించేది లేదన్నారు.

నవీకరించబడిన తేదీ – ఫిబ్రవరి 11, 2024 | 07:20 AM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *