తమ డిమాండ్ల సాధన కోసం రైతులు మరోసారి ఉద్యమాన్ని ప్రారంభించారు. కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్ తో హస్తినలో సమర శంఖం పూరించారు.
రైతుల నిరసన: రైతులు మరోసారి నిరసనకు దిగారు. తమ డిమాండ్ల సాధన కోసం మరోసారి దేశ రాజధాని ఢిల్లీ వేదికగా హోరెత్తించారు. మంగళవారం చలో ఢిల్లీ పేరుతో హస్తినలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో వేలాది మంది రైతులు ఢిల్లీ బాట పట్టారు. అన్నదాతల ఆందోళనతో ఢిల్లీ స్తంభించింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ స్తంభించింది. అన్నదాతల ఆందోళన నేపథ్యంలో వారి డిమాండ్లు ఏమిటని ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఇవీ రైతుల డిమాండ్లు.
ఎంఎస్ స్వామినాథన్ సిఫారసుల మేరకు అన్ని పంటలకు మద్దతు ధర కల్పించేలా చట్టం చేయాలి
రైతులకు వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేయాలి
భూసేకరణ చట్టం 2013 అమలు.. నాలుగు రెట్లు పరిహారం చెల్లించాలి
లఖిం పూరీ ఖేరీ ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించాలి.. బాధిత రైతు కుటుంబాలను ఆదుకోవాలి
WTOతో ఒప్పందాలపై నిషేధం ఉండాలి
రైతులకు, రైతు కూలీలకు పింఛన్ ఇవ్వాలి
ఢిల్లీ రైతాంగ ఉద్యమంలో మరణించిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం, పరిహారం ఇవ్వాలి
విద్యుత్ సవరణ బిల్లు 2020ని ఉపసంహరించుకోవాలి
వ్యవసాయాన్ని ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేయాలి. పనిదినాలు 200 రోజులకు పెంచాలి, దినసరి వేతనం రూ. 700 ఇవ్వాలి
నకిలీ విత్తనాలు, పురుగుమందుల తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి
మిర్చి, పసుపు మసాలా పంటలకు సంబంధించి జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి
గిరిజనులు, అటవీ భూముల హక్కులను కాపాడాలి
ఇది కూడా చదవండి: కేంద్ర మంత్రులతో చర్చలు విఫలం.. ఢిల్లీకి 2500 ట్రాక్టర్లతో రైతులు.. సరిహద్దుల్లో హై అలర్ట్
కేంద్రం ప్రతిపాదనకు ఢిల్లీ ప్రభుత్వం నో చెప్పింది
ఢిల్లీ చలో రైతుల ఆందోళన దృష్ట్యా బవానా స్టేడియంను జైలుగా మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను ఢిల్లీ ప్రభుత్వం తోసిపుచ్చింది. రైతుల డిమాండ్లు హేతుబద్ధమైనవని, వారిని అరెస్టు చేయడం సరికాదని ఢిల్లీ హోంమంత్రి కైలాష్ గెహ్లాట్ అన్నారు. శాంతియుత నిరసనలు ప్రతి పౌరునికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని గుర్తు చేశారు.