రెండు యూనిట్లతో ‘పుష్ప 2’ షూటింగ్ పూర్తి చేసి అనుకున్న తేదీకి విడుదల చేసేందుకు దర్శకుడు సుకుమార్ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ లేని సన్నివేశాలు పూర్తవుతున్నట్లు సమాచారం

అల్లు అర్జున్ మరియు సుకుమార్
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో ‘పుష్ప 2’ సినిమా ముందుగా ప్రకటించినట్లుగా ఆగస్ట్ 15న విడుదల అవుతుందా లేదా అనే సందేహం చాలా మందికి ఉంది. దీంతో ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీలో జోరుగా చర్చలు జరిగాయి. అయితే ఈ చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ జర్మన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి వెళ్లి ఈ చిత్రానికి మరో సీక్వెల్ ఉందని చెప్పడం చూస్తుంటే ఈ ‘పుష్ప 2’ ఆగస్ట్ 15న అనుకున్న ప్రకారం విడుదల కానుంది.
అంతే కాకుండా దర్శకుడు సుకుమార్ ఇప్పుడు రెండు యూనిట్లతో తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అల్లు అర్జున్ లేకుండానే సుకుమార్ సీన్స్ తీస్తున్న సంగతి తెలిసిందే. ఖైరతాబాద్‌లోని ఓ కాలేజీలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని బట్టి దర్శకుడు సుకుమార్ కూడా ఈ సినిమాను త్వరగా పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నట్లు అర్థమవుతోంది.
‘పుష్ప 3’ ఉన్నందున, సీక్వెల్ కోసం కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను వదిలివేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అందుకే ఈ ‘పుష్ప 2’ని త్వరగా పూర్తి చేయవచ్చని, పాటలు, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు మినహా భారీ షూటింగ్ ఏమీ లేకపోవడంతో ఈ సినిమాని ముందుగా అనుకున్న ప్రకారం ఆగస్ట్ 15న విడుదల చేయాలని భావిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో కూడా ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందని అయితే ఆ పాట కోసం బాలీవుడ్ నటి దిశా పటానీని పరిశీలిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై చిత్ర నిర్మాతల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రానికి నిర్మాతలు.
నవీకరించబడిన తేదీ – ఫిబ్రవరి 17, 2024 | 11:19 AM