మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి కన్నుమూశారు

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి (86) గుండెపోటుతో కన్నుమూశారు.

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి కన్నుమూశారు

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి కన్నుమూశారు

మనోహర్ జోషి: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి (86) శుక్రవారం కన్నుమూశారు. ఆయనకు గుండెపోటు రావడంతో బుధవారం ముంబైలోని పీడీ హిందూజా ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు. జోషి అంత్యక్రియలు ముంబైలోని శివాజీ పార్క్ శ్మశానవాటికలో జరగనున్నాయి. మనోహర్ జోషికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన భార్య అనఘా మనోహర్ జోషి 2020లో మరణించారు.

కౌన్సిలర్ నుంచి ముఖ్యమంత్రి వరకు..
మనోహర్ జోషి 1995 నుండి 1999 వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. అవిభాజ్య శివసేన పార్టీ నుండి మహారాష్ట్రలో అత్యున్నత పదవిని అధిష్టించిన మొదటి నాయకుడిగా గుర్తింపు పొందారు. పార్లమెంటు సభ్యునిగా కూడా ఎన్నికయ్యారు. 2002 నుంచి 2004 వరకు లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు.

మనోహర్ జోషి 1937 డిసెంబర్ 2న మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా నంద్విలో జన్మించారు. అతను ముంబైలో చదువుకున్నాడు. ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించిన జోషి 1967లో రాజకీయాల్లోకి ప్రవేశించి.. 40 ఏళ్లకు పైగా శివసేన పార్టీలో కొనసాగారు. మున్సిపల్ కౌన్సిలర్ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. జోషి 1968-70లో ముంబయిలో మునిసిపల్ కౌన్సిలర్‌గా మరియు 1970లో స్టాండింగ్ కమిటీ (మునిసిపల్ కార్పొరేషన్) ఛైర్మన్‌గా ఉన్నారు.

1972లో మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. మూడుసార్లు శాసనమండలికి ప్రాతినిధ్యం వహించారు. 1990లో మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 1990-91 కాలంలో మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. అతను 1999 సార్వత్రిక ఎన్నికలలో ముంబై నార్త్-సెంటర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి శివసేన టిక్కెట్‌పై గెలిచాడు.

ఇది కూడా చదవండి: జయలలిత నగలు తమిళనాడుకు చెందినవే.. బెంగళూరు కోర్టు తాజా తీర్పు.. అసలు కేసు ఏంటి?

కాగా, మనోహర్ జోషి మృతికి ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఇతర ప్రముఖులు సంతాపం తెలిపారు.

ఇది కూడా చదవండి: ఎన్నికల వేళ భారత కూటమికి బిగ్ రిలీఫ్.. కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *