శ్రేయాస్ అయ్యర్: మనసు మార్చుకున్న శ్రేయాస్ అయ్యర్.. రంజీ ట్రోఫీ సెమీస్‌లో ఆడేందుకు?

ABN
, ప్రచురించిన తేదీ – ఫిబ్రవరి 27 , 2024 | 08:36 PM

నిన్నటి వరకు రంజీ ట్రోఫీలో ఆడేందుకు నిరాకరించిన టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్.. ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో రంజీలో బరిలోకి దిగనున్నట్టు సమాచారం.

శ్రేయాస్ అయ్యర్: మనసు మార్చుకున్న శ్రేయాస్ అయ్యర్.. రంజీ ట్రోఫీ సెమీస్‌లో ఆడేందుకు?

నిన్నటి వరకు రంజీ ట్రోఫీలో ఆడేందుకు నిరాకరించిన టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్.. ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో రంజిలో బరిలోకి దిగనున్నట్టు సమాచారం. చాలా నివేదికల ప్రకారం, మార్చి 2 నుండి తమిళనాడుతో జరిగే సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ ముంబై తరపున ఆడనున్నాడు. అయితే అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. నిజానికి రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లోనే శ్రేయాస్ బరిలోకి దిగాల్సి ఉంది. బరోడాతో ముంబై ఆడే మ్యాచ్‌లో ఆడాల్సి ఉంది. కానీ శ్రేయాస్ అయ్యర్ బరిలోకి దిగలేదు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో శ్రేయాస్ అయ్యర్ విఫలమైన సంగతి తెలిసిందే. రెండు టెస్టుల్లో 27, 29, 35, 13 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో శ్రేయాస్ అయ్యర్ టీమ్ ఇండియాలో తదుపరి 3 టెస్టులకు ఎంపిక కాలేదు. వెన్నులో గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్‌ను జట్టులోకి తీసుకోలేదని మొదట వార్తలు వచ్చాయి. కానీ వరుస పరాజయాల తర్వాత శ్రేయాస్ అయ్యర్‌ని తీసుకోలేదని కన్ఫర్మ్ అయింది.

ఈ క్రమంలో ప్రస్తుతం భారత జట్టులో లేని ఆటగాళ్లంతా రంజీల్లో ఆడాలని బీసీసీఐ సెక్రటరీ జైషా ప్రకటించారు. అయితే వెన్నునొప్పి కారణంగా శ్రేయాస్ అయ్యర్ రంజీలకు దూరమయ్యాడు. అయితే ఇంతలో శ్రేయాస్ అయ్యర్‌కు ఎటువంటి గాయం లేదని, అతను పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని NCA క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చింది. అప్పటి నుంచి శ్రేయాస్ అయ్యర్ ఉద్దేశపూర్వకంగానే రంజీలకు దూరంగా ఉంటున్నాడనే ఊహాగానాలు జోరందుకున్నాయి. శ్రేయాస్ అయ్యర్ రంజీలకు దూరంగా ఉంటున్నాడన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఐపీఎల్‌ను దృష్టిలో పెట్టుకుని రంజీలు ఆడడం లేదని పలువురు మండిపడుతున్నారు. శ్రేయాస్ అయ్యర్‌తో పాటు ఇషాన్ కిషన్ కూడా ఈ కోవలోకి వచ్చారు. జైషా ఆదేశాలను కూడా పట్టించుకోకుండా రంజీలకు దూరంగా ఉంటున్నాడు. కాగా, బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించి రంజీలకు దూరంగా ఉంటున్న ఆటగాళ్ల కాంట్రాక్టులను బీసీసీఐ రద్దు చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. రంజీలు ఆడేందుకు శ్రేయాస్ అయ్యర్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నిజంగానే రంజీ ట్రోఫీ సెమీస్‌లో శ్రేయాస్ అయ్యర్ ఆడితే ఇషాన్ కిషన్ ఆడే అవకాశాలున్నాయి.

మరింత క్రీడా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నవీకరించబడిన తేదీ – ఫిబ్రవరి 27, 2024 | 08:36 PM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *