పతంజలి యాడ్స్ కేసు: పతంజలి యాడ్స్ పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది

హెర్బల్ ఉత్పత్తుల ప్రకటనలపై గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే మోసపూరిత ప్రకటనలను ఆపకపోతే భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించింది.

పతంజలి యాడ్స్ కేసు: పతంజలి యాడ్స్ పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది

పతంజలి ప్రకటనల కేసు

పతంజలి యాడ్స్ కేసు: పతంజలి ఆయుర్వేద ప్రకటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుదారి పట్టించే ప్రకటనల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం కూడా కళ్లు మూసుకొనిందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి తప్పుదోవ పట్టించే ప్రకటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

పతంజలి సంస్థ తాము తయారు చేస్తున్న హెర్బల్ ఉత్పత్తుల ద్వారా కొన్ని వ్యాధులు నయమవుతాయని చాలా కాలంగా ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) గతేడాది సుప్రీంకోర్టులో కేసు వేసింది. పతంజలి సంస్థ ఇస్తున్న ప్రకటనలు వైద్యులను కించపరిచేలా ఉన్నాయని పిటిషన్‌లో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు.. ఇలాంటి ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

అయితే హెర్బల్ ఉత్పత్తుల ప్రకటనలపై గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే మోసపూరిత ప్రకటనలను ఆపకపోతే భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించింది.

పతంజలికి సుప్రీంకోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. వినియోగదారులను తప్పుదారి పట్టించే ప్రకటనలకు వ్యతిరేకంగా తమ ఆదేశాలను ఉల్లంఘించినందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ నోటీసులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పంథాజలి ఔషధ ఉత్పత్తుల ప్రచారంపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. తదుపరి విచారణను మార్చి 15కి వాయిదా వేసింది.అల్లోపతిపై తప్పుడు ప్రచారంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు పతంజలి సంస్థకు నోటీసులు జారీ చేసింది.

కోవిడ్-19 వ్యాక్సినేషన్‌కు వ్యతిరేకంగా పతంజలి ప్రచారం చేసిందని ఆరోపిస్తూ గత ఏడాది నవంబర్‌లో ఐఎంఏ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు అహ్సానుద్దీన్ అమానుల్లా, ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారించింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనలను అస్సలు సహించేది లేదని జస్టిస్ అమానుల్లా ధర్మాసనం పేర్కొంది. యోగాతో మధుమేహం, ఉబ్బసం పూర్తిగా నయం అవుతాయని పతంజలి చెబుతోందని ఐఎంఏ సీనియర్ న్యాయవాది పీఎస్ పట్వాలియా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

పతంజలి ఆయుర్వేద సంస్థకు సంబంధించిన అన్ని తప్పుదారి పట్టించే ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశించింది. వ్యాధిని నయం చేస్తుందని తప్పుగా చెబుతున్న ఒక్కో ఉత్పత్తిపై కోటి రూపాయల వరకు జరిమానా విధించడాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *