లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంగన్‌వాడీలు, సహాయకులకు వేతనాలు పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్ పర్యటన సందర్భంగా మమతా బెనర్జీ ఈ విషయాన్ని ప్రకటించారు.

కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు (అంగన్‌వాడీ కార్యకర్తలు), వారి సహాయకుల వేతనాలను శుక్రవారం ప్రకటించారు. పెరిగిన వేతనాలు ఏప్రిల్ నుంచి అమలులోకి రానున్నాయి. వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్‌లో పర్యటించినప్పుడు అంగన్‌వాడా కార్యకర్తల జీతాలు పెంచుతూ మమతా బెనర్జీ చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
అంగన్‌వాడీ కార్యకర్తల నెలసరి వేతనాన్ని రూ.8,250 నుంచి రూ.9,000కు మమతా సర్కార్ పెంచింది. పెంచిన రూ.750 వచ్చే నెల జీతంలో కలుపుతారు. సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) కార్మికులకు రూ.500 వేతనాలు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. ఆశా వర్కర్లు చాలా కష్టపడి పని చేస్తున్నారు.. వారి వేతనాలు పెంచడం గర్వంగా ఉంది.. కష్టకాలంలో కూడా ఆశా వర్కర్లు ప్రభుత్వానికి సహాయం చేస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి వేతనాలు మరో రూ.750 పెంచడం సంతోషంగా ఉంది. ఐసీడీఎస్ హెల్పర్లకు జీతం రూ.6వేలు.. ఏప్రిల్ 1 నుంచి వారి వేతనాన్ని రూ.500 పెంచుతున్నామని.. మా ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని సీఎం అన్నారు. ఇటీవల ఒడిశా ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాన్ని రూ.7,500 నుంచి రూ.10,000కు, మినీ అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాన్ని రూ.5,375 నుంచి రూ.7,250కి పెంచింది. కేరళ ప్రభుత్వం కూడా గత జనవరిలో 60 వేల మంది అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనాలను రూ.1,000 పెంచింది.
నవీకరించబడిన తేదీ – మార్చి 06, 2024 | 03:43 PM