లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి మల్లికార్జున్ ఖర్గే దూరం.. కారణమా?

కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తాజా సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్లు సమాచారం.

లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి మల్లికార్జున్ ఖర్గే దూరం.. కారణమా?

మల్లికార్జున్ ఖర్గే లోక్‌సభ పోటీకి దూరంగా ఉండవచ్చునని వర్గాలు చెబుతున్నాయి

మల్లికార్జున ఖర్గే: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈసారి లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉంటారని సమాచారం. తాను పోటీలో ఉంటే ఆ పార్టీకి దేశంలో ప్రచారం చేయడం కష్టమనే భావనలో ఖర్గే ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన ఈసారి లోక్ సభ ఎన్నికలకు దూరంగా ఉంటారని తెలుస్తోంది. తాను ఒక్క నియోజకవర్గానికే పరిమితం కాకూడదని, దేశం మొత్తంపై దృష్టి సారిస్తానని ఖర్గే అన్నారు. ఇదిలా ఉండగా, పలువురు సీనియర్ నేతలు కూడా తాజా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇష్టపడకపోవడంతో తమ వారసులను రంగంలోకి దించాలని భావిస్తున్నారు.

ప్రియాంక్.. ఇంట్రెస్ట్ లేదు
కర్ణాటకలోని గుల్బర్గా నియోజకవర్గం నుంచి ఖర్గే పోటీ చేస్తారని మొదట వార్తలు వచ్చాయి. గతవారం గుల్బర్గా నియోజకవర్గానికి సంబంధించి చర్చించిన కర్ణాటక అభ్యర్థుల జాబితాలో ఖర్గే పేరు కూడా ఉంది. ఇక్కడ నుంచి తన అల్లుడు రాధాకృష్ణన్ దొడ్డమణిని పోటీకి దింపాలని ఖర్గే ఆలోచిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు మీడియాకు తెలిపాయి. ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపడం లేదని సమాచారం. దీంతో అల్లుడుని పోటీకి దింపాలని ఖర్గే భావిస్తున్నారట.

ఇది కూడా చదవండి: సీఏఏ అమలుపై హీరో విజయ్ స్పందిస్తూ.. తమిళనాడు ప్రభుత్వానికి కీలక సూచన

నాలుగు సంవత్సరాలు రాజ్యసభ సభ్యత్వం
ఖర్గే గుల్బర్గా నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. 2019లో ఓడిపోయి.. అప్పటి నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. పెద్దల సభలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. ఎగువ సభలో ఆయనకు మరో నాలుగేళ్లు మిగిలి ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల్లో పోటీ చేయని దాఖలాలు లేవు. గత ఎన్నికల్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరూ పోటీ చేసి గెలిచారు. రాహుల్ గాంధీ రెండు స్థానాల్లో పోటీ చేసినా ఒక స్థానంలో ఓడిపోయారు. కాగా, రాహుల్ గాంధీ ఈసారి కూడా తాను గెలిచిన వాయనాడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. వృద్ధాప్య సమస్యల కారణంగా సోనియా గాంధీ పోటీకి దూరంగా ఉన్నారు.

ఇది కూడా చదవండి: మోదీ మాటలు మాటలు.. భారత ప్రధానిపై పాక్ మహిళ ప్రశంసలు కురిపించింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *