మహారాష్ట్ర: మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్.. కారు దిగిన నేతలు..

ABN
, ప్రచురణ తేదీ – మార్చి 19, 2024 | 03:33 PM

కష్టాలు బీఆర్‌ఎస్‌ను వదలవు. ఒకవైపు తెలంగాణలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో బీఆర్ఎస్ నేతలు కారు దిగి ఇతర పార్టీల్లో చేరుతున్నారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీపై బీఆర్‌ఎస్‌ నాయకత్వం క్లారిటీ ఇవ్వకపోవడంతో బీఆర్‌ఎస్‌ నేతలు ఎటువైపు వెళ్లాలని చూస్తున్నారు.

మహారాష్ట్ర: మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్.. కారు దిగిన నేతలు..

కష్టాలు బీఆర్‌ఎస్‌ను వదలవు. ఒకవైపు తెలంగాణలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో బీఆర్ఎస్ నేతలు కారు దిగి ఇతర పార్టీల్లో చేరుతున్నారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీపై బీఆర్‌ఎస్‌ నాయకత్వం క్లారిటీ ఇవ్వకపోవడంతో బీఆర్‌ఎస్‌ నేతలు ఎటువైపు వెళ్లాలని చూస్తున్నారు.

కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రాజీనామా

తాజాగా మహారాష్ట్ర కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ రావ్ కదమ్ బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. ఆయనతో పాటు పలువురు స్థానిక నేతలు కారు దిగుతున్నారు. మాణిక్ రావ్ కదమ్ మహారాష్ట్రలో ప్రముఖ నాయకుడు. అంతకుముందు కేసీఆర్ టీఆర్ ఎస్ ను బీఆర్ ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు. ముందుగా మహారాష్ట్రలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని పలు పార్టీల నేతలను బీఆర్ ఎస్ లో చేర్చుకున్నారు.

మారిన సమీకరణాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ సమీకరణాలు మారాయి. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆ పార్టీ అధినేత కేసీఆర్ కాస్త కుంగిపోయారు. ప్రస్తుతం తెలంగాణ లోక్ సభ స్థానంపై గులాబీ బాస్ దృష్టి సారించారు. కేసీఆర్ తీరుపై మహారాష్ట్ర నేతలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మాణిక్‌రావు కదమ్‌ బీఆర్‌ఎస్‌ను వీడి ఎన్‌సీపీలో చేరారు. గతేడాది జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ బలపరిచిన అభ్యర్థులు కొంతమేర ప్రభావం చూపగలిగారు. దీంతో వచ్చే ఎన్నికల్లో మహారాష్ట్రలో పోటీ చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అయితే తెలంగాణలో ఫలితాల తర్వాత గులాబీ బాస్ సైలెంట్ అయినట్లు తెలుస్తోంది.

మరింత జాతీయ వార్తల కోసం ఇక్కడ నొక్కండి..

నవీకరించబడిన తేదీ – మార్చి 19, 2024 | 03:33 PM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *