‘రంగ్ దే’ తర్వాత నితిన్, వెంకీ కుడుముల మరోసారి ‘రాబిన్ హుడ్’ కోసం చేతులు కలిపారు. డిసెంబర్ 20న సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు, అయితే ఇందులో హీరోయిన్ ఎవరనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు. రష్మిక మందన్న, శ్రీలీల, ఇప్పుడు రాశి ఖన్నా చేస్తున్నట్టు సమాచారం.
శ్రీలీల, నితిన్, రాశి ఖన్నా
నితిన్, వెంకీ కుడుముల సినిమా పేరు ‘రాబిన్ హుడ్’ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోందని భోగట్టా. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీని డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.ఈ సినిమాలో నితిన్ ఇంతకు ముందు రాని రోబిన్ హుడ్ పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం.
ఈ సినిమా కోసం ప్రత్యేకంగా దర్శకుడు వెంకీ కుడుముల నితిన్ లుక్‌ని మారుస్తున్న సంగతి తెలిసిందే. నితిన్ ఇప్పటి వరకు చేయని విభిన్నమైన పాత్రలో నితిన్ ని చూపిస్తున్నాడని అంటున్నారు. అతడిని దొంగగా పరిచయం చేస్తూ టీజర్ హాస్యభరితంగా ఉండగా, పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఓ చిన్న వీడియో యాక్షన్ ప్యాక్‌గా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో, భారీ నిర్మాణ, సాంకేతిక విలువలతో నిర్మిస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో రాశి ఖన్నా కథానాయికగా నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం ముందుగా ఇద్దరి పేర్లను ప్రకటించినా వారు ఈ సినిమాలో నటించడం లేదు. మొదట ప్రకటించినప్పుడు రష్మిక మందన్న మహిళా కథానాయికగా అధికారికంగా ప్రకటించబడింది, అయితే ఆమె హిందీ చిత్రం చేస్తున్నందున ఆమె ఈ చిత్రం నుండి తప్పుకుంది. ఆ తర్వాత ఆమె స్థానంలో శ్రీలీల అని అధికారికంగా ప్రకటించారు. కానీ నితిన్, శ్రీలీల జంటగా నటించిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవడంతో శ్రీలీల కూడా రిజెక్ట్ అయింది. ఇప్పుడు ఆమె స్థానంలో రాశీఖన్నాను తీసుకున్నట్లు తెలుస్తోంది.
సినిమా షూటింగ్‌లో ఉండగానే విడుదల తేదీని ప్రకటించారు. రాబిన్ హుడ్ డిసెంబర్ 20న విడుదల కానుండగా.. ఈ సినిమాకి క్రిస్మస్ సెలవులు, ఆ తర్వాత న్యూ ఇయర్ సెలవులు కలిసి రావడంతో డేట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
నవీకరించబడిన తేదీ – ఏప్రిల్ 18, 2024 | 03:53 PM