‘కల్కి 2898 AD’ నిర్మాతలు శ్రీకాంత్ తనయుడు రోషన్‌తో సినిమాని అధికారికంగా ప్రకటించారు. అయితే మళ్లీ ఆ సినిమా గురించి ఎలాంటి సమాచారం లేదు. ‘కల్కి 2898 ఏడీ’ సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.
రోషన్ మేకా
సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ ‘పెళ్లి సందడి’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. రోషన్‌ని పరిచయం చేసే బాధ్యతను దర్శకుడు కె. రాఘవేంద్రరావు తీసుకున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. రోహన్ తండ్రి శ్రీకాంత్ కథానాయకుడిగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1996లో ఇదే పేరుతో ఓ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ‘పెళ్లిసందడి’ సినిమాకు అశ్వినీదత్, అల్లు అరవింద్ నిర్మాతలుగా వ్యవహరించారు.
ప్రస్తుతం వచ్చిన ‘పెళ్లిసందడి’ రోషన్‌కి మంచి బ్రేక్ ఇవ్వకపోయినా కథానాయకుడిగా వంద శాతం మార్కులు కొట్టేశాడు. ఈ చిత్రం తర్వాత, రోషన్ పాన్ ఇండియా మూవీలో కూడా పని చేస్తున్నాడు, ఇందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు మరియు రోషన్ మోహన్ లాల్ కొడుకుగా కనిపిస్తాడని చెప్పబడింది.
ప్రముఖ హిందీ నటుడు జితేంద్ర కుమార్తె ఏక్తా కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నందకిషోర్ దర్శకత్వం వహించిన ఇందులో పలువురు పాన్-ఇండియన్ నటీనటులు నటించారు. ఈ సినిమా తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ రోషన్ తో ఓ సినిమా చేస్తోందని వినిపిస్తోంది. అయితే ఈ సినిమాని చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేసినా షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. ప్రదీప్ అద్వైతం ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా పేరు ‘ఛాంపియన్’ అని తెలిసింది. ఎనౌన్స్‌మెంట్ వచ్చి చాలా రోజులైంది కానీ షూటింగ్ ఎప్పటి నుంచి మొదలవుతుందనే దానిపై క్లారిటీ లేదు.
ఇప్పుడు వైజయంతీ మూవీస్ సంస్థ ‘కల్కి 2898 ఏడి’ చిత్రాన్ని విడుదల చేస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో ఈ సినిమా విడుదల తర్వాత రోషన్ తో ‘ఛాంపియన్’ సినిమా షూటింగ్ ప్రారంభం కావచ్చని తెలుస్తుంది.
నవీకరించబడిన తేదీ – మే 01, 2024 | 02:35 PM