రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏపీ స్టడీ సర్కిల్-యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. విశాఖపట్నం కేంద్రంలో UPSC ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షల కోసం; విజయవాడ కేంద్రంలో APPSC గ్రూప్ 1 పరీక్ష కోసం; తిరుపతి కేంద్రంలో APPSC గ్రూప్ 2 పరీక్షల కోచింగ్. ఎస్సీ, ఎస్టీ, ఇతర కేటగిరీలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయస్సు ఆగస్టు 1 నాటికి 21 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు; బీసీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు వర్తిస్తుంది. కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలకు మించకూడదు.
ఎంపిక: అభ్యర్థులను ప్రీ-క్వాలిఫైయింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలో అన్ని ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. కరెంట్ ఈవెంట్స్, జనరల్ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ ఎకాలజీ, బయోడైవర్సిటీ మరియు క్లైమేట్ చేంజ్, ఇండియన్ పాలిటీ అండ్ డెవలప్‌మెంట్, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్ ఇన్ ఇండియా, ఇండియా మరియు వరల్డ్ జియోగ్రఫీ, ఇండియాస్ నేషనల్ మూమెంట్ నుండి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ఈ పరీక్షలో సాధించిన ప్రతిభ ఆధారంగా మొత్తం 150 మందికి అవకాశం కల్పిస్తారు. UPSC నిర్వహించే ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్ కోచింగ్‌కు ఎంపిక చేస్తారు. ఇందులో 50 నుంచి 100 మందికి అవకాశం కల్పించనున్నారు. మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు పర్సనాలిటీ టెస్ట్‌పై అవగాహన కల్పిస్తారు. అనుభవజ్ఞులైన IAS/IPS/IFS/IRS అధికారుల సహాయంతో వ్యక్తిత్వ పరీక్షలు నిర్వహిస్తారు. వీటికి హాజరయ్యే అభ్యర్థులకు న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో బస ఏర్పాటు చేస్తారు.
ముఖ్యమైన సమాచారం
దరఖాస్తు రుసుము లేదు
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 5
వెబ్‌సైట్: apstdc.apcfss.in
నవీకరించబడిన తేదీ – 2023-07-26T13:03:14+05:30 IST