అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఏజెంట్’. అగ్ర దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా అవుతుంది. వేసవి కానుకగా పలు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ‘ఏజెంట్’ చిత్రీకరణ పూర్తి కాకముందే ఈ సినిమా కర్ణాటక, తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయి.
‘ఏజెంట్’ కర్ణాటక, తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను అనిల్ సుంకర గంపగుత్తగా విక్రయించారు. ఈ రాష్ట్రాల హక్కులను వైజాగ్‌కు చెందిన గాయత్రీ ఫిల్మ్స్ 34 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. జీఎస్టీని మినహాయించి ఇంత భారీ ధర చెల్లించడం విశేషం. ఈ చిత్రంలో సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాతో సాక్షి వైద్య టాలీవుడ్లోకి అడుగుపెట్టనుంది. హీరోయిన్గా ఆమెకు ఇదే మొదటి సినిమా. ‘ఏజెంట్’ ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. ‘ఏజెంట్’ నుంచి ‘మళ్లీ మళ్లీ నువ్వే..’ అనే టైటిల్‌తో ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్ లో అఖిల్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. హీరో హీరోయిన్ల మధ్య సాగే రొమాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అఖిల్ అక్కినేని కెరీర్ విషయానికి వస్తే, అతను చివరిగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో కనిపించాడు. పూజా హెగ్డే కథానాయికగా నటించింది. బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వం వహించారు. GA2 పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
^^^^^^^^^^^^^^^^^^^^^
ఇది కూడా చదవండి:
ఉత్తమ నటుడి అవార్డు అందుకునే అర్హత నాకు లేదు: రణబీర్ కపూర్.. ‘పుష్ప’లో అల్లు అర్జున్ అద్భుతం..
RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్లతో పోటీపడుతున్న రామ్ చరణ్, తారక్
విశాల్: భారీ ప్రమాదం.. విశాల్ కొంచెం ముందే ప్రాణాలు కోల్పోయి ఉండేవాడు.. వీడియో వైరల్
నాని: నెపోటిజానికి ప్రేక్షకులే కారణం..!
నవీకరించబడిన తేదీ – 2023-02-24T16:39:46+05:30 IST