‘బాహుబలి’తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాస్. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో రెబల్ స్టార్ వరుసగా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. ‘సాలార్’, ‘ప్రాజెక్ట్ కె’, ‘రాజా డీలక్స్’ వంటి సినిమాలు చేస్తున్నాడు.
‘బాహుబలి’తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాస్. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో రెబల్ స్టార్ వరుసగా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. ‘సాలార్’, ‘ప్రాజెక్ట్ కె’, ‘రాజా డీలక్స్’ వంటి సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ప్రభాస్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ గురించి ఓ క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. ‘పఠాన్’ దర్శకుడితో డార్లింగ్ ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ హీరో నటించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
‘బ్యాంగ్ బ్యాంగ్’, ‘వార్’ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. అతను యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించడంలో కూడా ప్రసిద్ధి చెందాడు. అదే బాటలో ఇటీవలే ‘పఠాన్’ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబడుతోంది. ఈ స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ 2024లో పూర్తయ్యే అవకాశం ఉంది.ఈ సినిమా 2025లో థియేటర్లలోకి రానుంది.గతంలో హృతిక్ రోషన్ తో సిద్ధార్థ్ ‘ఫైటర్’ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
నవీకరించబడిన తేదీ – 2023-01-29T22:28:57+05:30 IST