Chess World Cup : చెస్‌ వరల్డ్‌కప్‌ బరిలో హంపి, హారిక

Chess World Cup : చెస్‌ వరల్డ్‌కప్‌ బరిలో హంపి, హారిక



ABN
, First Publish Date – 2023-07-26T02:24:55+05:30 IST

అజర్‌బైజాన్‌లోని బాకు నగరంలో ఈనెల 30 నుంచి వచ్చే నెల 24 వరకు జరిగే చెస్‌ వరల్డ్‌క్‌పలో తెలుగు గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, ఇరిగేసి అర్జున్‌, హర్ష భరత్‌కోటి బరిలోకి దిగనున్నారు.

Chess World Cup : చెస్‌ వరల్డ్‌కప్‌ బరిలో   హంపి, హారిక

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): అజర్‌బైజాన్‌లోని బాకు నగరంలో ఈనెల 30 నుంచి వచ్చే నెల 24 వరకు జరిగే చెస్‌ వరల్డ్‌క్‌పలో తెలుగు గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, ఇరిగేసి అర్జున్‌, హర్ష భరత్‌కోటి బరిలోకి దిగనున్నారు. వీరితో పాటు భారత్‌ నుంచి యువ జీఎంలు గుకేష్‌, ప్రజ్ఞానంద, సీనియర్‌ జీఎంలు ఎస్‌.ఎల్‌ నారాయణన్‌, విదిత్‌ సంతోష్‌ గుజరాతి, నిహాల్‌ సరీన్‌, అధిబన్‌, అభిమన్యు, వైశాలి, మేరీ గోమ్స్‌, పీవీ నందిదా, దివ్య దేశ్‌ముఖ్‌ టోర్నీలో ఆడనున్నారు. ఈ మెగా టోర్నీలో పురుషుల, మహిళల కేటగిరీల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు వచ్చే ఏడాది కెనడాలో జరిగే క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తారు. ఈ వరల్డ్‌క్‌ప పురుషుల విభాగంలో వరల్డ్‌ నెంబర్‌ వన్‌ కార్ల్‌సన్‌, వరల్డ్‌ చాంపియన్‌ డింగ్‌ లిరెన్‌, ఇయాన్‌ నెపోమ్నిచి, నకముర, మహిళల్లో వరల్డ్‌ చాంపియన్‌ జు వెన్‌జున్‌, 2021 వరల్డ్‌కప్‌ విజేత అలెగ్జాండ్రా కోస్టెనియుక్‌, హంపి ఫేవరెట్లుగా పోటీపడుతున్నారు.

Updated Date – 2023-07-26T02:24:55+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *