గుంటూరు కారం : బర్త్ డే కానుకగా మరో అప్ డేట్.. ఈసారి బాక్సాఫీస్ వద్ద బాబు మాస్ తో..

మహేష్ బాబు పుట్టినరోజుకి మరో గిఫ్ట్ గుంటూరు కారం మేకర్స్. ఈసారి బాక్సాఫీసు వద్ద బాబు మాస్..

గుంటూరు కారం : బర్త్ డే కానుకగా మరో అప్ డేట్.. ఈసారి బాక్సాఫీస్ వద్ద బాబు మాస్ తో..

గుంటూరు కారం సినిమా నుండి మహేష్ బాబు కొత్త పోస్టర్ విడుదల

గుంటూరు కారం : సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు కారం’. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ విడుదలై హైప్ ను మరింత పెంచాయి. మొదటి పోస్టర్ నుండి, మేకర్స్ మాస్ టచ్ ఇస్తూ, మహేష్ బాబు ఈసారి పూర్తి మాస్ చిత్రంలో కనిపించబోతున్నారనే ఫీలింగ్‌ని జోడిస్తున్నారు. ఇక ఈరోజు ఆగస్ట్ 9 మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అర్ధరాత్రి పోస్టర్ రిలీజ్ చేసారు.

Mahesh Babu : మహేష్ కి బర్త్ డే విషెస్ తెలిపిన టాలీవుడ్ ప్రముఖులు.. విష్ చేసింది ఎవరో తెలుసా..?

ఆ పోస్టర్‌లో మహేష్ లుంగీ కట్టుకుని.. బీడీ కట్టుకుని.. గాజులు కట్టుకుని.. మాస్ లుక్‌లో కనిపించాడు. తాజాగా మరో పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్ కూడా మాస్ టచ్ తో నిండిపోయింది. ఈ పోస్టర్లు, గ్లింప్స్ చూస్తుంటే ఈసారి బాబు మాస్ బాక్సాఫీస్ ని బద్దలు కొడుతుందేమో అనిపిస్తుంది. అయితే బర్త్ డే పోస్టర్స్ కాకుండా చిన్నపాటి టీజర్ లేదా సాంగ్ రిలీజ్ చేసి ఉంటే బాగుండేదని కొందరు అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరు కారం సినిమా నుండి మహేష్ బాబు కొత్త పోస్టర్ విడుదల

గుంటూరు కారం సినిమా నుండి మహేష్ బాబు కొత్త పోస్టర్ విడుదల

Mahesh Babu : విదేశాల్లో ఫ్యామిలీతో మహేష్ బాబు బర్త్ డే వెకేషన్.. పిక్స్ చూసారా..?

మరి ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతుండటంతో.. చెప్పిన తేదీ ప్రకారం సంక్రాంతి వస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కొత్త పోస్టర్ ఆ సందేహాన్ని పటాపంచలు చేసింది. ఈ సినిమాను 2024 జనవరి 12న సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తామని స్పష్టం చేశారు. కాగా, ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించనుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *