ఈరోజు బంగారం ధర: బంగారం కొనేందుకు ఇదే చక్కటి అవకాశం..! తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

ఈరోజు బంగారం ధర: బంగారం కొనేందుకు ఇదే చక్కటి అవకాశం..!  తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

ప్రపంచ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నేటి ట్రేడింగ్‌లో స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఔన్సు బంగారం ధర 2 డాలర్లకు తగ్గింది.

ఈరోజు బంగారం ధర: బంగారం కొనేందుకు ఇదే చక్కటి అవకాశం..!  తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

బంగారం ధర

ఈరోజు బంగారం ధర: గత రెండు వారాలుగా వరుసగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. శ్రావణ మాసం ప్రారంభం కావడంతో మరికొద్ది రోజుల్లో పెళ్లిళ్ల సీజన్‌ శుభ ముహూర్తాలతో ప్రారంభం కానుంది. దీంతో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం బంగారం ధరలు రూ.60 వేల దిగువన ట్రేడవుతున్నాయి. మరి కొద్దిరోజుల్లో శుభ కార్యాలు ఉన్నవారు ఇప్పుడే బంగారం కొంటే మంచిదని చెప్పవచ్చు.

బంగారం

బంగారం

తెలుగు రాష్ట్రాల్లో సోమవారం నాటి బంగారం ధరలను పరిశీలిస్తే, తెలంగాణ, హైదరాబాద్, వరంగల్‌లోని ప్రధాన నగరాల్లోని బులియన్ మార్కెట్‌లో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.54,650 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.59,620గా ఉంది. గత మూడు రోజులుగా వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.76,200 మార్కు వద్ద అమ్ముడవుతోంది.

బంగారం

బంగారం

ఏపీలోనూ బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,650, అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం రూ.59,620 వద్ద ట్రేడవుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఉదయం 6 గంటలకు నమోదైన వివరాల ప్రకారం ధరలు ఇలా ఉన్నాయి. అయితే ఈ ధరల్లో స్వల్ప మార్పులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.

బంగారం

బంగారం

ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ. 54,800 (22 క్యారెట్లు), రూ.59,760 (24 క్యారెట్లు). అదేవిధంగా చెన్నైలో 10 గ్రాముల బంగారం ధర రూ. 55,000 (22 క్యారెట్లు), రూ. 60 వేలు (24 క్యారెట్లు), 10 గ్రాములు ముంబైలో రూ. 54,650 (22 క్యారెట్లు), రూ. 59,620 (24 క్యారెట్లు), బెంగళూరు రూ. 54,650 (22 క్యారెట్లు), రూ.59,620 (24 క్యారెట్లు).

బంగారం

బంగారం

ప్రపంచ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నేటి ట్రేడింగ్‌లో స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఔన్సు బంగారం ధర 2 డాలర్లకు తగ్గింది. ప్రస్తుతం, బంగారం ధర ఔన్స్‌కు 1911.55 డాలర్లుగా ట్రేడవుతోంది. స్పాట్ వెండి ధర 22.64 డాలర్లుగా ఉంది. అయితే డాలర్ విలువ పెరుగుతుండడంతో రూపాయి విలువ పడిపోతోంది. డాలర్‌తో భారత రూపాయి తాజా విలువ రూ. 82.980 మార్క్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *