వన్డే ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ ఇంగ్లండ్ క్రికెట్ అభిమానులకు శుభవార్త. 2019 వన్డే ప్రపంచకప్ హీరో బెన్ స్టోక్స్ యూటర్న్ తీసుకున్నాడు. ముందుగా వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన అతడు ఇప్పుడు వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ మేరకు బుధవారం 15 మంది సభ్యులతో తాత్కాలిక బృందాన్ని ఈసీబీ ప్రకటించింది. బెన్ స్టోక్స్ వారి విజ్ఞప్తికి ప్రతిస్పందనగా వన్డే రిటైర్మెంట్‌పై యూ-టర్న్ తీసుకున్నట్లు ECB తెలిపింది. అంతేకాకుండా, వన్డే ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లండ్ న్యూజిలాండ్‌తో నాలుగు వన్డేలు మరియు నాలుగు టీ20లు కూడా ఆడనుంది. ఈ సిరీస్‌లకు కూడా విడివిడిగా జట్లను ఈసీబీ ప్రకటించింది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లోనూ స్టోక్స్ ఆడనున్నాడు.
ఇది కూడా చదవండి: ఐర్లాండ్ టీ20 సిరీస్: చరిత్ర సృష్టించనున్న బుమ్రా.. తొలి భారత బౌలర్‌గా రికార్డు..!!
ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 5 వరకు నాలుగు టీ20 సిరీస్‌లు జరగనుండగా, సెప్టెంబర్ 8 నుంచి 15 వరకు వన్డే సిరీస్ జరగనుండగా.. ప్రపంచకప్‌కు ముందు జట్టు ప్రదర్శనను విశ్లేషించిన తర్వాత సెలక్టర్లు జట్టు ఎంపికను ఖరారు చేస్తారు. అక్టోబర్ 5 నుంచి భారత్‌లో వన్డే ప్రపంచకప్ జరగనుండగా.. గత ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించిన పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌కు ఈసీబీ ప్రకటించిన జట్టులో చోటు దక్కలేదు. అతని స్థానంలో సర్రే ఫాస్ట్ బౌలర్ అట్కిన్సన్‌కు సెలెక్టర్లు జట్టులో చోటు కల్పించారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతున్న పురుషుల వంద బాల్ లీగ్‌లో రాణిస్తున్నాడు.
ఇంగ్లాండ్ ODI ప్రపంచ కప్ తాత్కాలిక జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, జోరూట్, జాసన్ రాయ్, మొయిన్ అలీ, భైర్ స్టో, సామ్ కర్రాన్, లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, రాస్ టోప్లీ, డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్, అట్కిన్సన్
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, మొయిన్ అలీ, అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, బెన్ డకెట్, విల్ జాక్స్, లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్, జాన్ టర్నర్, ల్యూక్ వుడ్
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), జాసన్ రాయ్, మొయిన్ అలీ, జోరూట్, అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్, లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, బెన్ స్టోక్స్, రాస్ ట్యాప్లీ, డేవిడ్ విల్లీ, మార్క్‌వుడ్, క్రిస్ వోక్స్
నవీకరించబడిన తేదీ – 2023-08-16T20:06:48+05:30 IST