ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీని జగన్ రెడ్డి మార్చబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. నిధుల సమస్య వెంటాడుతుండడంతో.. తాము చేసిన దోపిడీని మరిచిపోయేలా మళ్లీ దుకాణాల వేలం నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మద్యం షాపులన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. దశలవారీగా మద్యాన్ని నిషేదిస్తామని జగన్ హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటళ్లకే పరిమితం చేసి ఓట్లు అడుగుతామన్నారు. కానీ ఆ దిశగా చర్యలు లేవు. పైకెత్తిన చేతులు. మద్యనిషేధంపై ఎవరైనా ప్రశ్నిస్తే పేదల పథకాలకు డబ్బులు అందకుండా చేస్తున్నారన్నారు. జగన్ రెడ్డి మైండ్ సెట్ ఏంటో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.
అక్టోబరు 1తో ప్రస్తుత మద్యం పాలసీ గడువు ముగియనుండడంతో మళ్లీ అదే పాలసీకి కొత్త జీవోను అందించాలి. అయితే మళ్లీ వేలం ద్వారా ప్రైవేటు వ్యక్తులకు నిర్వహణ బాధ్యతలు అప్పగించడంపై నివేదిక సిద్ధం చేశారు. డిసెంబర్‌లో ఎప్పుడో ముగియనున్న లైసెన్సుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు దరఖాస్తులు తీసుకుని వేలం వేస్తూ ఎన్నికలకు ముందు నిధుల సమీకరణకు పూనుకుంది. ఒక్కో దరఖాస్తుకు రెండు లక్షలకు పైగా రుసుము వసూలు చేస్తే రెండున్నర వేల కోట్ల వరకు ఆదాయం వస్తోంది. ఇదే ఏపీ ప్రభుత్వ పెద్దలను ఆకర్షిస్తోందని అంటున్నారు.
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం నిధుల కొరతను ఎదుర్కొంటోంది. ఈ విధానానికి మారడం ద్వారా సంక్షేమ పథకాలకు అవసరమైన నిధులు ఒకేసారి సమకూరుతాయని చెబుతున్నారు. విధాన మార్పు జరిగితే శాసనసభలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. వచ్చే నెలలో జరగనున్న వర్షాకాల సమావేశాల్లో మద్యం పాలసీ మార్పు బిల్లును కూడా జగన్ రెడ్డి అనుకుటే ప్రవేశపెట్టే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
పోస్ట్ ఏపీలో మళ్లీ ప్రైవేట్ మద్యం దుకాణాలు!? మొదట కనిపించింది తెలుగు360.