‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ టాప్ డైరెక్టర్ శంకర్‌తో కలిసి ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో నటిస్తున్నారు. రీసెంట్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ ని కలిశాడు. వారితో సరదాగా గడిపారు. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ టాప్ డైరెక్టర్ శంకర్‌తో కలిసి ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో నటిస్తున్నాడు. రీసెంట్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ ని కలిశాడు. వారితో సరదాగా గడిపారు. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గురువారం దర్శకుడు శంకర్ 60వ పుట్టినరోజు సందర్భంగా తమిళ సినీ పరిశ్రమలోని ప్రముఖులు, సన్నిహితులకు శంకర్ పార్టీ ఇచ్చాడు. చెన్నై వేదికగా జరిగిన వేడుకలో రామ్‌చరణ్, విక్రమ్, థమన్, లోకేష్ కనగరాజ్, వెట్రిమారన్, విఘ్నేష్ శివన్, గౌతం వాసుదేవ్ మీనన్, లింగుస్వామి, గోపీచంద్ మలినేని తదితరులు పాల్గొన్నారు. ఈ క్రమంలో కోలీవుడ్ ప్రముఖులతో చరణ్ సరదాగా మాట్లాడాడు.
‘గేమ్ ఛేంజర్’ సినిమా విషయానికొస్తే… పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది. శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న తొలి సినిమా ఇది. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ కథానాయిక. శంకర్ ‘భారతీయుడు-2’తో బిజీగా ఉండటంతో రామ్‌చరణ్ తండ్రి షూటింగ్‌కి కొంత గ్యాప్ ఇచ్చాడు. త్వరలోనే తాజా షెడ్యూల్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.
జనవరి నుంచి బుచ్చిబాబు సినిమా
శంకర్ సినిమా పూర్తయిన వెంటనే బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్‌చరణ్ సినిమా ప్రారంభం కానుంది. మైత్రీ మూవీమేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తన గత సూపర్‌హిట్ చిత్రాలతో పోల్చితే ఇది మంచి కథ అని, తన కెరీర్‌కు ప్రత్యేకతనిచ్చే చిత్రమని రామ్‌చరణ్ పలు సందర్భాల్లో చెప్పారు. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్‌లో ప్రారంభం కావాలి. తాజా సమాచారం ప్రకారం వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్ ప్రారంభం కానుందని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
నవీకరించబడిన తేదీ – 2023-08-18T14:56:03+05:30 IST