అమీర్ ఖాన్: అమీర్ ఖాన్ రీఎంట్రీ షురూ.. 3 ఇడియట్స్ సీక్వెల్..?

అమీర్ ఖాన్: అమీర్ ఖాన్ రీఎంట్రీ షురూ.. 3 ఇడియట్స్ సీక్వెల్..?

తన కెరీర్ ప్రారంభించిన తర్వాత, అమీర్ మొదటిసారి సినిమాలకు విరామం ప్రకటించి తన కుటుంబంతో గడుపుతున్నాడు. దీంతో ఏడాది నుంచి కనిపించని అమీర్ ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తున్నాడు..

అమీర్ ఖాన్: అమీర్ ఖాన్ రీఎంట్రీ షురూ.. 3 ఇడియట్స్ సీక్వెల్..?

అమీర్ ఖాన్ తదుపరి చిత్రం జనవరి 2024 నుండి క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది

అమీర్ ఖాన్: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా వచ్చి దాదాపు ఏడాది కావస్తోంది. అతను చివరిగా ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రంలో కనిపించాడు. ‘సలాం వెంకీ’ సినిమాలో కనిపించినా అది గెస్ట్ రోల్ మాత్రమే. ప్రస్తుతం సినిమాలకు విరామం ఇచ్చి కుటుంబంతో గడుపుతున్నాడు. కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత అమీర్ ఇంత గ్యాప్ తీసుకోవడం ఇదే తొలిసారి. తన తదుపరి సినిమా గురించి అడిగినప్పుడు కూడా ఇప్పుడు నటించే ఆలోచన లేదని చెప్పాడు.

బస్ డిపోలో రజినీకాంత్: తలైవా.. నిజమైన సూపర్ స్టార్..

ప్రస్తుతం అమీర్ తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రముఖ టాలీవుడ్ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. అమీర్ తన సొంత చిత్ర నిర్మాణ సంస్థలో కొత్త సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమైనట్లు సమాచారం. జనవరి 20, 2024 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు షెడ్యూల్ కూడా ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న సినిమాను విడుదల చేయనున్నారు.

జవాన్: జవాన్‌లోని ‘రామయ్యా వస్తావయ్యా’ పాట విడుదల.. షారుక్ డ్యాన్స్ అదుర్స్..

ఈ చిత్రానికి సంబంధించిన దర్శకుడు, నటీనటులు, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలను కూడా త్వరలో ప్రకటిస్తారు. తన తోటి హీరోలు సల్మాన్, షారుఖ్ వరుసగా సినిమాలు చేస్తుండగా.. అమీర్ ఇలా బ్రేక్ ఇవ్వడం ఆయన అభిమానులను కాస్త నిరాశకు గురి చేసింది. అయితే ఇప్పుడు ఈ వార్త అమీర్ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇదిలావుంటే, ‘3 ఇడియట్స్’ సీక్వెల్ కోసం రాజ్‌కుమార్ హిరానీ కూడా కథను సిద్ధం చేస్తున్నట్లు ఆ సినిమాలో నటించిన శర్మన్ జోషి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మరి అమీర్ రీఎంట్రీ ఇవ్వనున్న సినిమా ఏంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *