స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్ మంగళవారం ప్రస్తావనకు రానుంది.

చంద్రబాబు అరెస్ట్
స్కిల్ డెవలప్‌మెంట్ కేసు: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్ మంగళవారం ప్రస్తావనకు రానుంది. క్వాష్ పిటిషన్‌ను రేపు ప్రస్తావించేందుకు సీజేఐ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం అనుమతించింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ చెల్లదంటూ సీఐడీ ఎఫ్‌ఐఆర్ కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా ప్రస్తావించారు.
ఇది ఏపీ వ్యవహారమని.. ప్రతిపక్షాలను అణచివేస్తున్నారని లూథ్రా సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే దీనిపై సీజేఐ స్పందిస్తూ.. చంద్రబాబు ఎన్ని రోజుల నుంచి కస్టడీలో ఉన్నారని ప్రశ్నించారు. ఈ నెల 8న తనను అరెస్టు చేసినట్లు లూత్రా తెలిపారు. రేపు (మంగళవారం) ప్రస్తావన జాబితా ద్వారా రావాలని న్యాయవాదులకు సీజేఐ సూచించారు. రేపు ప్రస్తావన జాబితాలో పూర్తిస్థాయిలో వింటామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. ఇదిలావుంటే, ఇప్పటికే చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. విచారణ చివరి దశలో ఉన్నందున జోక్యం చేసుకోలేమని గత శుక్రవారం క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను ప్రస్తావించారు. చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారని, తక్షణమే విచారణ జరిపించాలని లూత్రా సుప్రీంకోర్టును కోరారు. రేపు ప్రస్తావన జాబితా ద్వారా రావాలని సీజేఐ సూచించారు. ఇదిలావుంటే, ఏపీ ప్రభుత్వం తరఫున హైకోర్టులో వాదించిన ముకుల్ రోహత్గీ, సీఐడీ తరఫున వాదించిన రంజిత్ కుమార్ కూడా సుప్రీంకోర్టుకు హాజరయ్యారు.