శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘కోటబొమ్మాళి పిఎస్’. తేజ మార్ని దర్శకత్వం వహించగా బన్నీవాస్ మరియు విద్యా కొప్పినీడు నిర్మించిన…

శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘కోటబొమ్మాళి పిఎస్’. తేజ మార్ని దర్శకత్వం వహించగా బన్నీవాస్ మరియు విద్యా కొప్పినీడు నిర్మించారు. ఈ నెల 24న విడుదలవుతోంది. తాజాగా చిత్ర బృందం ‘కోట బొమ్మాళి పీఎస్ ప్రచారసభ’ పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. పోలీసులను పట్టుకోవాల్సిన వింత కథాంశంతో ‘కోటబొమ్మాళి పీఎస్’ తెరకెక్కింది. ఈ సినిమాలో కథే హీరో. పోలీసులను రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటారో చెప్పేందుకు ఈ సినిమా చేశాం. అంతే కాకుండా సినిమాలో పోలీసులను, రాజకీయ నాయకులను కించపరచలేదు. మా సంస్థ నుంచి మరింత మంది నిర్మాతలు రావాలని కోరుకుంటున్నాను’ అన్నారు. ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ లో శ్రీకాంత్ ని లాక్ చేయడం వల్లే ‘కోటబొమ్మాళి పీఎస్’ షూటింగ్ ఆలస్యమైందని నిర్మాత దిల్ రాజు అన్నారు. మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన కమర్షియల్ సినిమా ఇది. ‘లింగిడి’ పాట తర్వాత అంచనాలు భారీగా పెరిగాయి” అన్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ ‘‘కోటబొమ్మాళి పీఎస్ నా కెరీర్‌లో ఓ ప్రత్యేక చిత్రం. ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రేక్షకులకు కొత్త తరహా సినిమా చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. బన్నీవాస్ మాట్లాడుతూ.. ‘అల్లు అరవింద్ ఇచ్చిన ధైర్యంతో ఈ సినిమాలో కొన్ని విషయాలు నేరుగా చెప్పాం. చిన్న సంఘటన పెద్ద సమస్యగా మారి ఎన్నికలను ఎలా శాసించిందని ఈ చిత్రంలో చూపించాం’ అని అన్నారు. కష్టపడి నచ్చి అందరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించానని రాహుల్ విజయ్ అన్నారు. లింగిడి సాంగ్‌లో నటించడం చాలా గొప్పగా అనిపించిందని శివాని రాజశేఖర్ అన్నారు. ప్రస్తుత వ్యవస్థలో పోలీసులను ఎలా నలిపేస్తున్నారో ఈ సినిమాలో చూపించాం అని తేజ మార్ని అన్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘ట్రైలర్ చూశాను, సినిమా పెద్ద హిట్ అవుతుంది’ అన్నారు.
నవీకరించబడిన తేదీ – 2023-11-22T00:28:48+05:30 IST