జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) శనివారం నాలుగు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి నకిలీ కరెన్సీ నోట్ల రాకెట్‌ను ఛేదించింది. నకిలీ భారతీయ కరెన్సీ నోట్లు, ప్రింటింగ్ మిషన్లు, ప్రింటింగ్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు.

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) శనివారం నాలుగు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి నకిలీ కరెన్సీ నోట్ల రాకెట్‌ను ఛేదించింది. నకిలీ భారతీయ కరెన్సీ నోట్లు, ప్రింటింగ్ మిషన్లు, ప్రింటింగ్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.6,600 విలువైన నకిలీ కరెన్సీ నోట్లను కూడా ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ కరెన్సీలన్నీ రూ.500, రూ.200, రూ.100 నోట్ల రూపంలో ఉన్నాయి. భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సంబంధిత సెక్షన్ల కింద నవంబర్ 24న నమోదైన కేసుపై ఎన్ఐఏ ఈ చర్య తీసుకుంది. నకిలీ కరెన్సీ నోట్లను సరిహద్దుల గుండా తరలించేందుకు, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో నకిలీ కరెన్సీ చలామణిని ప్రోత్సహించేందుకు నిందితులు కుట్ర పన్నారని ఎన్‌ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో నిందితులపై ఎన్‌ఐఏ అధికారులు శనివారం దాడులు చేశారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివిధ రాష్ట్రాల్లోని కీలక నిందితుల ప్రాంగణాల్లో ఎన్ఐఏ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాకు చెందిన రాహుల్ తానాజీ పాటిల్, యవత్మాల్ జిల్లాకు చెందిన శివ్ పాటిల్, ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాకు చెందిన వివేక్ ఠాకూర్, కర్ణాటకలోని బళ్లారి జిల్లాకు చెందిన మహేందర్, బీహార్‌లోని రోహతాస్ జిల్లాకు చెందిన శశిభూషణ్ ఇళ్లలో నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. శివపాటిల్ అనే వ్యక్తి మరికొంత మందితో కలిసి పక్క దేశాల నుంచి నకిలీ కరెన్సీ, ప్రింటింగ్ మిషన్లు సేకరించి మన దేశంలో చలామణి చేసినట్లు విచారణలో తేలింది. మహేందర్ ఇంట్లో ప్రింటర్‌ను ఎన్‌ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణలో నకిలీ కరెన్సీ నోట్లను సరఫరా చేస్తానని హామీ ఇచ్చిన రాహుల్ తానాజీ పాటిల్, మోసపూరితంగా పొందిన సిమ్ కార్డులను ఉపయోగించి చెల్లింపులు చేస్తున్నాడని తేలింది.
నవీకరించబడిన తేదీ – 2023-12-02T20:23:59+05:30 IST