డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రాబోతున్న ‘కన్నప్ప’ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. న్యూజిలాండ్‌లో సుదీర్ఘ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని కన్నప్ప జట్టు ఇటీవలే భారత్‌కు తిరిగి వచ్చింది. తాజాగా మేకర్స్ కన్నప్ప నుండి మరో అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్, ప్రభాస్, మోహన్ బాబు వంటి హేమాహేమీలు నటిస్తున్నారని ఇదివరకే ప్రకటించారు. ఇక ఇప్పుడు మంచు మూడో తరం కూడా ఈ కన్నప్ప సినిమాలో నటిస్తున్నాడు.
మోహన్ బాబు వారసుడు విష్ణు మంచు. విష్ణు మంచు వారసుడిగా కన్నప్పతో అవ్రామ్ మంచు ఎంట్రీ ఇవ్వనున్నాడు. విజువల్‌గా అద్భుతమైన ‘కన్నప్ప’తో విష్ణు మంచు తన ఐదేళ్ల కుమారుడు అవ్రామ్‌తో సినీ రంగ ప్రవేశం చేశాడు. టార్చ్ బేరర్ మొదలు భారతీయ దిగ్గజ నటుడు డా.ఎం.మోహన్ బాబు, మూడు తరాల మంచు కుటుంబ సభ్యులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
న్యూజిలాండ్‌లోని అందమైన ప్రకృతి దృశ్యాలలో 90 రోజుల పాటు షూట్ చేసిన సంగతి తెలిసిందే. కన్నప్పలో అవ్రామ్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉన్నట్లు తెలుస్తోంది. తన కొడుకు సినిమా ఎంట్రీపై మంచు విష్ణు స్పందించారు. ‘ఈ ‘కన్నప్ప’ సినిమాకు నా జీవితంలో చాలా ప్రాముఖ్యత ఉంది. నా కొడుకు అవ్రామ్ కీలక పాత్రలో నటించడం చూసి చాలా గర్వంగా ఉంది. ఇది కేవలం చిత్రం కాదు. మా కుటుంబంలోని మూడు తరాల కలయికలో వస్తున్న అరుదైన సినిమా ఇది.
కన్నప్ప తొలి షెడ్యూల్ పూర్తి కాగానే, తనకు సహకరించిన టీమ్‌కి మంచు విష్ణు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు కొడుకు ఎంట్రీపై స్పందించాడు. అవ్రామ్‌తో ఈ సినిమా ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను. సినీ ప్రేమికులందరికీ శుభాకాంక్షలు. ‘కన్నప్ప’ అందరికీ గుర్తుండిపోయే అనుభవం. ఇది మా కుటుంబంలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది.