విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి వీడీ12 సినిమా పరిస్థితి ఏంటి? ఆ సినిమా గురించి నిర్మాత నాగవంశీ ఏమన్నాడు?

విజయ్ దేవరకొండ వీడీ12 సినిమాపై నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు
విజయ్ దేవరకొండ: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తన 12వ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత నాగవంశీ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్‌లో నిర్మించనున్నారు. విజయ్ కి కథానాయికగా శ్రీలీల కూడా ఎంపికైంది. పూజ కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ సినిమా ఇప్పటి వరకు షూటింగ్ కి వెళ్ళలేదు.
ఇదిలావుంటే… దర్శకుడు గౌతమ్ తిన్ననూరి నాగవంశీ నిర్మాణంలో ‘మ్యాజిక్’ అనే మ్యూజికల్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. కొత్త వాళ్లందరితో ఈ సినిమా రూపొందనుంది. వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ప్రేక్షకుల్లో ఓ సందేహం మొదలైంది.
ఇది కూడా చదవండి: హనుమాన్ OTT : ఆ పండగకి హనుమాన్ OTT రిలీజ్.. ఎప్పుడో తెలుసా? ఏ OTTలోకి?
విజయ్, గౌతమ్ కాంబినేషన్‌లో ప్రకటించిన వీడీ12 సినిమా ఏమైంది..? ఆగిపోయిందా? అనే సందేహం మొదలైంది. ఇదే విషయమై సోషల్ మీడియా ద్వారా నాగవంశీని ప్రశ్నించారు. దానికి ఆయన స్పందిస్తూ.. ‘విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత వీడీ12 స్టార్ట్ అవుతుంది’ అని ట్వీట్ చేశాడు. ఫ్యామిలీ స్టార్, మ్యాజిక్ సినిమాలు వేసవిలోనే షూటింగ్ పూర్తి చేసుకోనున్నాయి.
#VD12 ఫ్యామిలీ స్టార్ షూటింగ్ పూర్తి కాగానే షూటింగ్ మళ్లీ ప్రారంభమవుతుంది
– నాగ వంశీ (@vamsi84) జనవరి 29, 2024
దీంతో విజయ్, గౌతమ్‌లు ఖాళీ కానున్నారు. VD12 వేసవిలోనే పట్టాలపైకి వస్తుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నాడు. అయితే ఈ సినిమాపై విజయ్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.