సెన్సెక్స్ 358 పాయింట్లు లాభపడింది
ముంబై: క్రితం సెషన్లో లాభాలతో ప్రారంభమై భారీ పతనాన్ని చవిచూసిన స్టాక్ మార్కెట్లో సీన్ రివర్స్ అయింది. గురువారం నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు మళ్లీ లాభాల బాట పట్టాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో 585.92 పాయింట్లు కోల్పోయి 70,000 స్థాయిని కోల్పోయిన సెన్సెక్స్, మార్కెట్ దిగ్గజాలు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో కొనుగోళ్లతో మధ్యాహ్న సమయానికి లాభాల్లోకి వచ్చింది. చివరకు 358.79 పాయింట్ల వృద్ధితో 70,865 వద్ద ముగిసింది. నిఫ్టీ 104.90 పాయింట్లు లాభపడి 21,255.05 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 21 లాభపడ్డాయి. పవర్‌గ్రిడ్ 2.27 శాతం పెరిగి ఇండెక్స్ టాప్ గెయినర్‌గా నిలిచింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 1.82 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.38 శాతం లాభపడ్డాయి. ఈ రెండు కంపెనీల షేర్లు సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా పెరగడానికి దోహదపడ్డాయి. లాభాల స్వీకరణ కారణంగా బుధవారం భారీగా పతనమైన చిన్న, మధ్య తరహా కంపెనీల షేర్లలో ఇన్వెస్టర్లు భారీగా కొనుగోలు చేశారు. దీంతో బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.69 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.61 శాతం చొప్పున పెరిగాయి. రంగాల వారీగా సూచీల్లో యుటిలిటీస్ అండ్ పవర్ 2 శాతానికి పైగా పెరగగా.. ఆయిల్ అండ్ గ్యాస్, టెలికాం, ఎనర్జీ ఒక శాతానికి పైగా పెరిగాయి. ఆటో ఇండెక్స్ మాత్రమే నష్టపోయింది.
-
ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసలు నష్టపోయి రూ.83.27 వద్ద ముగిసింది. భారత మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణే ఇందుకు కారణం.
-
అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 0.33 శాతం పెరిగి 79.96 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
-
ఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.50 తగ్గి రూ.63,050కి చేరుకుంది. వెండి ధర రూ.600 పెరిగి రూ.79,100కి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 0.21 శాతం పెరిగి 2,052 డాలర్లకు చేరుకోగా, వెండి 24.58 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
ఐనాక్స్ ఇండియా లిస్టింగ్ చిరునామా
క్రయోజెనిక్ ట్యాంకర్ల తయారీ సంస్థ ఐనాక్స్ ఇండియా బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజీలలో షేర్లను లిస్ట్ చేసింది. ఐపీఓ ధర రూ.660తో పోలిస్తే 41.38 శాతం ప్రీమియంతో బీఎస్ఈలో కంపెనీ షేరు రూ.933.15గా నమోదైంది.ఒక దశలో 50 శాతం వృద్ధితో రూ.990కి చేరింది. తొలి రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి కంపెనీ షేరు 42.40 శాతం లాభంతో రూ.939.90 వద్ద స్థిరపడింది. దాంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,530.86 కోట్లుగా నమోదైంది. సోమవారం ముగిసిన రూ.1,460 కోట్ల ఐనాక్స్ ఇండియా ఐపీఓ 61.28 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయింది.