చివరిగా నవీకరించబడింది:
తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల హారన్ మోగింది. ఈ తరుణంలో నేటి నుంచి ఎంసెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 10, 11 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్ ప్రవేశ పరీక్షలు.. మే 12, 13, 14 తేదీల్లో ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు.. ఈ ఎంసెట్ పరీక్షను హైదరాబాద్ జేఎన్‌టీయూ నిర్వహిస్తోంది.

TS Eamcet 2023: తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల హారన్ మోగింది. ఈ తరుణంలో నేటి నుంచి ఎంసెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 10, 11 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్ ప్రవేశ పరీక్షలు.. మే 12, 13, 14 తేదీల్లో ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. JNTU హైదరాబాద్ నిర్వహించిన ఈ ఎంసెట్ పరీక్షకు 3.20 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. .
కాగా, ఈ ఎంసెట్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో జరుగుతాయి. ఈ క్రమంలో పరీక్షల కోసం తెలంగాణలో 104, ఏపీలో 33 కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈసారి కొత్తగా 28 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
పరీక్షా నియమాలు (TS Eamcet 2023)..
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటరు ఐడీకి సంబంధించిన ఏదైనా ఒరిజినల్ కార్డ్‌ని తీసుకెళ్లాలి.
జిరాక్స్‌లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని అధికారులు తెలిపారు.
అదే సమయంలో ఈ పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.
గంటన్నర ముందుగా పరీక్షా కేంద్రాలకు రావాలని సూచించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష హాలులోకి కాలిక్యులేటర్లు, చేతి గడియారాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని తెలిపారు.
విద్యార్థుల బయోమెట్రిక్ సేకరిస్తామని అధికారులు సూచిస్తున్నారు.