రిష్వీ తిమ్మరాజు, విస్మయశ్రీ హీరోయిన్లుగా ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్ యాంగిల్ లవ్ స్టోరీగా.. సరికొత్త కథ, కథనంతో శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్‌పై పెట్ల కృష్ణమూర్తి, పెట్ల వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కె శ్రీలత సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన రాజేష్ దొండపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 4న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, రెండు పాటలకు మంచి స్పందన లభించింది. కొత్త కథానాయికలను పరిచయం చేస్తున్న ఈ చిత్రం యూత్ ఆడియన్స్ ఆదరణ పొందుతుందనే నమ్మకంతో ఉన్నారు. (కృష్ణ గాడు అంటే ఒక రేంజ్ రిలీజ్ డేట్)
రియాలిటీకి దగ్గరగా, కామెడీ, రొమాన్స్, యాక్షన్ ఇలా అన్ని జోనర్‌లను టచ్ చేసే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు మేకర్స్. ఈ సినిమాకి సంగీతం, సినిమాటోగ్రఫీ హైలెట్‌గా నిలుస్తాయని అంటున్నారు.. ఒక్క దెబ్బతో టార్గెట్ కొట్టేస్తానని మా కృష్ణ గాడు తన రేంజ్ చూపించేందుకు సిద్ధమయ్యాడు.
****************************************
****************************************
****************************************
****************************************
****************************************
నవీకరించబడిన తేదీ – 2023-07-12T17:59:16+05:30 IST