దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటులలో దళపతి విజయ్ ఒకరు. అంతే కాకుండా భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో విజయ్ కూడా ఒకరు. అయితే ఇప్పుడు విజయ్ రాజకీయాల్లోకి వస్తాడని అనేక వార్తలు వస్తున్నాయి. విజయ్ సినిమాలను ఆపివేస్తాడని, ఇదే చివరి సినిమా అని వార్తలు రావడంతో విజయ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టడం ఖాయమని కూడా అంటున్నారు.
అయితే ఈ వార్తలకు బలం చేకూర్చేలా విజయ్ తన అభిమాన సంఘాల నేతలతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నాడు. ఈ మధ్య కాలంలో విజయ్ 10, 12వ తరగతి పరీక్షల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను సన్మానించడమే కాకుండా నగదు బహుమతులు అందజేసి వారిని ప్రోత్సహించారు. అలాగే తమిళనాడులో రాష్ట్రంలోని పలు సమస్యలపై ఆరా తీస్తున్నారు. తన అభిమాన సంఘాలను సామాజిక సేవ చేసేలా ప్రోత్సహిస్తున్నాడు.
ఇప్పుడు విజయ్ ‘లియో’ #లియో సినిమా షూటింగ్ పూర్తి చేశాడు. #Thalapathy67 లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 19న విడుదలవుతోంది.ఈ సినిమా షూటింగ్ ముగిసిన వెంటనే విజయ్ తన అభిమాన సంఘం నాయకులతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు మూడు రోజుల పాటు సాగే అవకాశం ఉందని, ఇందులో విజయ్ రాజకీయ ప్రవేశం, రాష్ట్రంలో సమస్యలు, రాజకీయాల్లోకి వస్తే సినిమాలు ఆపేయడం వంటి అంశాలపై మాత్రమే చర్చిస్తారని కూడా చెబుతున్నారు.
అలాగే విజయ్ అభిమాన సంఘాల నేతలు కూడా విజయ్ కు సంపూర్ణ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. విజయ్ రాజకీయాల్లోకి వస్తే ఆయన వెంటే ఉంటామని అందరూ కూడా అంటున్నారు. ఈ సమావేశంలో తమిళనాడు రాష్ట్రంలోని ముఖ్యమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. అసెంబ్లీ నియోజకవర్గాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విజయ్ రాజకీయాల్లోకి వచ్చే సమయం కూడా వచ్చిందని అంటున్నారు. ఈ ‘లియో’ సినిమా తర్వాత #Thalapathy68 దర్శకుడు వెంకట్ ప్రభుతో సినిమాని అధికారికంగా ప్రకటించారు.
ఎందుకంటే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమస్యలు తెలుసుకుంటే పాదయాత్రలో ప్రజలతో సమస్యలను చర్చించుకోవచ్చని కూడా అంటున్నారు. అందుకే #లియో సినిమా విడుదలకు ముందే ‘లియో’ ఈ పాదయాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తమిళనాడులో ఎక్కడ చూసినా ఇదే అంశంపై విజయ్ రాజకీయాల్లోకి వస్తాడనే చర్చ నడుస్తోందని అంటున్నారు. ఇదంతా చూస్తుంటే మరికొద్ది రోజుల్లో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై సంచలన ప్రకటన చేసే అవకాశం ఉందని విజయ్ అభిమానులతో పాటు తమిళనాడు ప్రజలు చూస్తున్నారు.
నవీకరించబడిన తేదీ – 2023-07-12T13:02:29+05:30 IST