వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల పర్స్ పెంచాలని బీసీసీఐ భావిస్తోంది. దీంతో ఐపీఎల్ రేంజ్ మరింత పెరగనుంది. ఐపీఎల్‌ను ఇప్పటికే డబ్బు సంపాదించే లీగ్‌గా పిలుస్తారు. తాజా సమాచారం ప్రకారం 2024 ఐపీఎల్ కోసం ఫ్రాంచైజీ పర్స్ రూ.100 కోట్లకు పెరగనుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ వేలానికి ఫ్రాంచైజీల పర్స్ పెంచుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. దీంతో ఐపీఎల్ రేంజ్ మరింత పెరగనుంది. ఐపీఎల్‌ను ఇప్పటికే డబ్బు సంపాదించే లీగ్‌గా పిలుస్తారు. తాజా సమాచారం ప్రకారం 2024 ఐపీఎల్ కోసం ఫ్రాంచైజీ పర్స్ రూ.100 కోట్లకు పెరగనుంది. 10 ఫ్రాంచైజీలు కొత్త పర్స్ విలువతో ఈ ఏడాది చివర్లో వేలంలో పాల్గొంటాయి. దీంతో ఎక్కువ మంది ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలకు అవకాశం లభిస్తుంది. గతేడాది కూడా వేలానికి ముందు ఫ్రాంచైజీల పర్స్ పెంచుతూ బీసీసీఐ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: భారత డబుల్స్ టాప్ షట్లర్లు: కొరియాను పాడు
మరోవైపు బీసీసీఐ ఫ్రాంచైజీ పర్స్‌ను పెంచడంతో రిటైన్ అయ్యే ఆటగాళ్ల సంఖ్య కూడా పెరుగుతుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆటగాళ్లను అట్టిపెట్టుకునే ప్రక్రియ ముగిసిన తర్వాతే ఐపీఎల్ నిర్వాహకులు వేలం నిర్వహిస్తారు. ఈ ఏడాది క్రిస్మస్ తర్వాత వేలం ప్రక్రియ నిర్వహించనున్నట్టు చర్చ జరుగుతోంది. అక్టోబర్-నవంబర్ నెలల్లో వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఈ మెగా టోర్నీ పూర్తయిన తర్వాత బీసీసీఐ ఐపీఎల్ వేలం తేదీలను ప్రకటించనుంది. గతేడాది ఐపీఎల్ వేలం కొచ్చిలో జరగ్గా, ఈ ఏడాది ముంబై, జైపూర్, అహ్మదాబాద్, కోల్‌కతాలో వేలం జరిగే అవకాశం ఉంది. కాగా, గతేడాది జరిగిన ఐపీఎల్ వేలంలో 10 ఫ్రాంచైజీలు కలిసి రూ.167 కోట్లు వెచ్చించాయి. మొత్తం 80 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి.
నవీకరించబడిన తేదీ – 2023-07-24T14:36:39+05:30 IST