ABN
, First Publish Date – 2023-07-26T02:35:15+05:30 IST
స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్(Kidambi Srikanth), హెచ్‌ఎ్‌స ప్రణయ్(Pranay) జపాన్ ఓపెన్(Japan Open)లో శుభారంభం చేశారు.

టోక్యో: స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్(Kidambi Srikanth), హెచ్‌ఎ్‌స ప్రణయ్(Pranay) జపాన్ ఓపెన్(Japan Open)లో శుభారంభం చేశారు. మంగళవారం ఆరంభమైన ఈ పోటీల తొలి రౌండ్‌లో శ్రీకాంత్ 21-13, 21-13తో చౌ టైన్ చెన్ (తైవాన్)పై, ప్రణయ్ 21-17, 21-13తో లి షిఫెంగ్ (చైనా)పై సునాయాసంగా నెగ్గి ముందంజ వేశారు. అయితే, తదుపరి రౌండ్‌లో వీరిరువురు అమీతుమీ తేల్చుకోనున్నారు. మహిళల సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్ 17-21, 17-21తో యమగూచి (జపాన్) చేతిలో పోరాడి ఓడింది. ఇక డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జోడీ 11-21, 21-15, 21-14తో సయాక హోబార-సుయిజు (జపాన్)పై నెగ్గి ముందంజ వేసింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి-రోహన్ కపూర్ జంట తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. బుధవారం పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ జోడీ తొలి రౌండ్ పోటీలు జరగనున్నాయి.
Updated Date – 2023-07-26T02:35:15+05:30 IST